బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే..తమన్‌ లైవ్‌ పర్ఫామెన్స్‌!

36
thaman

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 నేటితో ముగియనుంది. ఇక ఇవాళ జరిగే గ్రాండ్ ఫినాలేకు బిగ్ బాస్ నిర్వాహకులు అదిరిపోయే ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే టైటిల్ విన్నర్ ఎవరనే దానిపై అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తుండగా అందుకు తగ్గట్టుగా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధమయ్యారు.

ఇందులో భాగంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ లైవ్ పర్ఫామెన్స్ ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన తమన్‌..9 నెలల తర్వాత పర్ఫామెన్స్ ఇస్తున్నందుకు హ్యాపీగా ఉందని వెల్లడించారు.

ఇక ఇదే ఈవెంట్‌లో ‘లవ్ స్టోరీ’ మూవీ ప్రమోషన్స్ కూడా చేయనున్నారని సమాచారం. శేఖర్ కమ్ముల, సాయి పల్లవి, నాగ చైతన్య అంతా వేదికపై సందడి చేయనున్నారట. ఈ గ్రాండ్ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా మెగాస్టార్ చిరంజీవి రానుండగా టైటిల్ ఎవరిని వరిస్తుందో వేచిచూడాలి.