టాలీవుడ్ హీరోయిన్స్ అసలు పేర్లు తెలుసా..!

277
Tollywood Stars and their Original Names
- Advertisement -

సినిమా అనే గ్లామర్ ప్రపంచంలో చాలా మంది హీరోయిన్లు వస్తున్నారు..పోతున్నారు. అయితే కొంతమంది హీరోయిన్లు మాత్రం ఇండస్ట్రీ ఉన్నంత వరకు గుర్తుండి పోయేంతగా పేరు తెచ్చుకున్నారు. ఇక తెలుగులో టాప్ హీరోయిన్లుగా వెలిగిపోయిన కొంత మంది హీరోయన్లు వారి అసలు పేరు ఇండస్ట్రీకి వచ్చాక మార్చుకున్నారు.

సినిమా వాళ్ల పేర్లకు పబ్లిక్ లో పబ్లిసిటీయే వేరు. కొంత మంది ఇండస్ట్రీలో మంచి పేరు పొందాలంటే జాతక రిత్యా పేరు మార్చుకోవాలని కూడా మార్చుకున్నారు. కారణం ఏదైనా మన టాలీవుడ్ లో స్టార్ డం సంపాదించిన హీరోయిన్లలో అనేక మందికి అసలు పేర్లు వేరే ఉన్నాయి. ఆ పేర్లతోనే పాపులర్ అయ్యారు. ఇండస్ట్రీకి వచ్చి తమ సొంత పేర్లు మార్చుకున్న హీరోయిన్ల ఎవరో ఒకసారి చూద్దాం.    సహజనటి జయసుధ అసలు పేరు సుజాత. ఆమె పుట్టిందీ..పెరిగింది మద్రాస్ లోనే. అయితే జయసుధ సినిమాల్లోకి అడుగుపెట్టే సమయానికి మరో సుజాత ఉండటంతో పేరు మార్చోవాల్సి వచ్చింది.

అతిలోక సుందరి శ్రీదేవి అసలు పేరు శ్రీ అమ్మ అయ్యంగార్ అయ్యప్పన్ . పుట్టింది తమిళనాట అయినా ముంబాయికి చెందిన స్టార్ ప్రొడ్యూసర్ ని పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయ్యింది. అందం, అభినయం, నాట్య మయూరి అయిన జయప్రధ అసలు పేరు లలితా రాణి.    ఫైర్ బ్రాండ్ రోజా అసలు పేరు  శ్రీలత రెడ్డి.  సౌందర్య  అసలు పేరు సౌమ్య.

సినిమా ఇండస్ట్రీలో బాల నటిగా పరిచయం అయిన రాశి అసలు పేరు మంత్ర.  నిజంగా దివి నుంచి భువికి దిగివచ్చిన అందాల బొమ్మగా ఉంటుంది రంభ.. గ్లామర్ అనే పదం వినగానే 1990ల ప్రేక్షకులకి గుర్తొచ్చే పేరు రంభ. రంభ అసలు పేరు విజయలక్ష్మీ. ఢిల్లీ నుంచి వచ్చిన రచన చావ్లా కాస్త భూమికగా మార్చుకుంది. ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిని హాట్ బ్యూటీ అనుష్క అసలు పేరు స్వీటి శెట్టి. రజినీకాంత్ తో ‘చంద్రముఖి’ చిత్రంతో పరిచయం అయిన కేరళా బ్యూటీ నయనతార అసలు పేరు డయాన మరియమ్ కురియన్. ఈ భామలంతా అసలు పేర్లను మార్చుకుని మారు పేర్లతో సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగుతున్నారు.

- Advertisement -