‘జెర్సీ’ దర్శకుడికోసం క్యూ కట్టిన నిర్మాతలు

210
Gaotham Tinnanuri

న్యాచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ జెర్సీ.. ఎప్రిల్ 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈమూవీ విజయంతంగా దూసుకుపోతుంది.అంతేకాకుండా బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా సినిమా నిలిచిపోతుందనడంతో ఎటువంటి సందేహం లేదు అని చెప్పుకోవచ్చు..

శ్రద్దా శ్రీనాధ్ హీరోయిన్ గా నటించిన ఈమూవీని సూర్య దేవర నాగవంశీ నిర్మించారు. దర్శకుడు గౌతమ్ తీసిన రెండు సినిమాలు మళ్లీ రావా, జెర్సీ చిత్రాలు మంచి విజయాన్ని సాధించడంతో ఆయన కోసం టాలీవుడ్ నిర్మాతలు క్యూ కట్టారట. మరి కొంత మంది మాత్రం అతనికి అడ్వాన్స్ కూడా ఇచ్చేస్తున్నారట.

టాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు గౌతమ్ తర్వాతి మూవీ వరుణ్ తేజ్ తో ఉండనుందని తెలుస్తుంది. ఈమూవీకి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు నిర్మించనున్నారని సమాచారం. ఇప్పటికే దిల్ రాజు గౌతమ్ తిన్ననూరికి అడ్వాన్స్ కూడా ఇచ్చాడని తెలుస్తుంది. ఈవార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.