అల్లు అర్జున్ మూవీలో విలన్ గా హన్సిక

245
Allu Arjun Hansika
- Advertisement -

స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని బేగంపేట్ లో ఈసినిమా రెగ్యూలర్ షూటింగ్ ను ప్రారంభించారు చిత్రయూనిట్. బన్నీ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డె నటిస్తుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ కు తల్లిగా బాలీవుడ్ హీరోయిన్ టబును తీసుకోగా తండ్రి పాత్రలో జయరామ్ నటిస్తున్నారు.

కీలక పాత్రలో అక్కినేని సుమంత్, నవదీప్ లు నటించగా మరో ముఖ్యమైన పాత్రకోసం హీరోయిన్ హన్సిక ను తీసుకున్నట్లు తెలుస్తుంది. కానీ ఆమెను తీసుకునేది హీరోయిన్ పాత్రకోసం కాదంట…పూర్తిగా నెగిటెవ్ షెడ్స్ ఉన్న రోల్ కోసం హన్సికను సంప్రదించినట్టుగా సమాచారం. ఇటివలే త్రివిక్రమ్ ఆమెకు కథ వినిపించడంతో హన్సిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తుంది.

హన్సిక త్వరలోనే ఈమూవీ షూటింగ్ లో పాల్గోననుందని చెబుతున్నారు చిత్రయూనిట్. గీతా ఆర్ట్స్, , హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈమూవీని దసరా సెలవుల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.గతంలో అల్లు అర్జున్ హన్సిక కలిసి దేశముదురు సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

- Advertisement -