మరో రెండు రోజుల్లో ఎల్పీ విలీనం

255
trs-and-congress
- Advertisement -

తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోతుంది. ఇటివలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మొత్తం 19 స్ధానాల్లో గెలవగా టీడీపీ 2స్ధానాల్లో గెలిచింది. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు వరుసగా టీఆర్ఎస్ లో చేరిపోయారు. ఇప్పటికే 12మంది గులాబీ గూటికి చేరిపోగా ఇంకా ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తే టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేయవచ్చు..

ఇప్పటికే ఆత్రం సక్కు, రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య, పి.సబితారెడ్డి, హరిప్రియా నాయక్, కె.ఉపేందర్‌రెడ్డి, డి.సుధీర్‌రెరెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, వనమా వెంకటేశ్వర్‌రావు, జాజుల సురేందర్, గండ్ర వెంకటరమణారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. మరో ఇద్దరూ కూడా టీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్దమైనట్లు తెలుస్తుంది. వారిద్దరూ కూడా చేరితే కాంగ్రెస్ పార్టీ లెజిస్టేచర్ విలీనం అవుతుందని తెలుస్తుంది.

దీంతో మొత్తం 13 మంది సంతకాలు సేకరించి శాసనసభ స్పీకర్‌కు లేఖ ఇవ్వాలని నిర్ణయించింది. త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు జరుగనుండటంతో మరో రెండు రోజుల్లోనే కాంగ్రెస్ ఎల్పీని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేయనున్నట్లు సమాచారం. ఇంకా ఒక్క ఎమ్మెల్యే టీఆర్ఎస్ లో చేరితే విలీనం అతితొందర్లోనే జరుగనుంది.

- Advertisement -