ఈ విలన్ దానం చేసిన ఆస్తుల విలువెంతో తెలుసా…?

532
prabhakar reddy
- Advertisement -

తెలుగు చిత్ర పరిశ్రమలో తిరుగులేని నటుల్లో ఒకరు దివంగత ఎం. ప్రభాకర రెడ్డి గా ప్రసిద్ధులైన డాక్టర్ మందాడి ప్రభాకర రెడ్డి. అలనాటి సినిమాల్లో విలనిజానికి కేరాఫ్‌గా నిలిచిన ప్రభాకర్ రెడ్డి తన నటన అంతకుమించి మానవత్వంతో ఎంతో ప్రేక్షకుల ఆదరాభిమానాలను సంపాదించుకున్నారు.

తన 37 ఏళ్ల సినీ కెరీర్‌లో తెలుగు,తమిళ,హిందీ భాషల్లో కలిపి 472 సినిమాలకు పైగా నటించిన ప్రభాకర్ రెడ్డి పలు సినిమాలకు కథలు సైతం అందించారు. సినీ ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలకు గుర్తుగా హైదరాబాద్‌ మణికొండలో ఆయన స్మారకార్ధం చిత్రపురి కాలనీ డా. ప్రభాకరరెడ్డి చలనచిత్ర కార్మిక చిత్రపురి కాలనీగా నామకరణం చేశారు.

ఇక ఇదంతా నాణేనికి ఒకవైపు. మరోవైపు ఆయన దానం చేసిన ఆస్తుల విలువ అక్షరాల 500 కోట్లు. హైదరాబాద్‌లో కొంత స్థలం ఉంటే స్టూడియోనో, సినిమా హాలో కట్టుకుంటున్న హీరోలు ఉన్న సమయంలో ప్రభాకర్ రెడ్డి తన భూమిని సినీ కార్మికులకు ఇళ్ల స్థలాల కోసం దానం చేశారు. ఇప్పుడు ఈ స్థలంలోనే” చిత్రపురం” కాలనీ ఏర్పడింది.ప్రభాకర్ రెడ్డి దానం చేసిన భూమి విలువ ఇప్పుడు అక్షరాలా 500 కోట్లు. ఆయన చలవ వల్లే ఇప్పుడు సినీ కార్మికులంతా స్వంతింట్లో ఉంటున్నారు. అందుకే మనం గొప్పగా చెప్పుకుంటూ అభిమానించే హీరోల కంటే ప్రభాకర్ రెడ్డి వెయ్యి రెట్లు గొప్ప.

మద్రాస్‌లో ఉన్నప్పుడు కూడా ఆయన సినీ కార్మికులను బాగా చూసుకునే వారు. ఎందరికో తన ఇంట్లోనే ఆశ్రయం ఇచ్చేవారు. పరిశ్రమ హైదరాబాద్‌కు వచ్చాక ఆయన సినీ కార్మికుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ సినీ కార్మికుల సమాఖ్యను ఏర్పాటు చేసి దానికి అధ్యక్షుడిగా పని చేశారు. హైదరాబాద్ వంటి మహానగరంలో సినీ కార్మికుల సగం సంపాదన ఇంటి అద్దెలకే పోతున్నందున వారికి ఒక స్వంతిల్లు ఉంటే బాగుంతుందని అనుకున్నారు.ఇందుకు గానూ తానే ఒకడుగు ముందుకేసి తన 10 ఎకరాల భూమిని సినీ కార్మికుల ఇళ్ల స్థలాలకు కేటాయించారు. ప్రభుత్వాన్ని ఒప్పించి మరికొంత భూమి ఇప్పించారు. ఇలా సినీ కార్మికుల కోసమే చిత్రపురి కాలనీ ఏర్పాటైంది. 62 ఏళ్ల వయస్సులో 1997లో ప్రభాకర్ రెడ్డి తుదిశ్వాస విడిచారు.

- Advertisement -