సినిమా రంగురంగుల ప్రపంచం. దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నట్లుగా లైమ్ లైట్లో ఉన్నప్పుడే అంతా చక్కబెట్టుకోవాలి. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా హీరోయిన్లు అందాల ఆరబోతకు సైతం వెనుకాడరు. ఇందులో భాగంగా సినిమా కోసం వ్యభిచారులుగా మారి అంటే ఆ క్యారెక్టర్ని ఒప్పుకోని నటించిన మెప్పించిన భామలు ఎందరో.
ఎందుకంటే స్టార్ హీరోయిన్లుగా ఉన్నప్పుడే వ్యభిచార పాత్రలో నటించారంటే వారి తర్వాతి సినిమాలపై ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అయినా సరే సినిమా కోసం ఆ పాత్రలో నటించేందుకు సిద్ధమయ్యారంటే ఇండస్ట్రీ పట్ల వారికి ఉన్న కమిట్ మెంట్‌కు అది నిదర్శనం. ముఖ్యంగా రమ్యకృష్ణ, అనుష్క, ఛార్మీ, సదా,శ్రియ,స్నేహ,ఉదయభాను,సంగీత ఇలా ఎంతోమంది హీరోయిన్లు వ్యభిచారపాత్రలో నటించి మెప్పించారు.
కమల్‌హాసన్ పంచతంత్రం సినిమాలో వ్యభిచారిగా నటించిన రమ్యకృష్ణ మంచి మార్కులు కొట్టేసింది. తర్వాత సూపర్ డీలక్స్ సినిమాలోనూ నటించి మెప్పించింది. ఇక అనుష్క సైతం వేదం సినిమాలో తన పాత్రకు వందశాతం న్యాయం చేసింది. ఆమె నటను ఫిదాకాని వారుండరు.
ఇక శ్రీయ సైతం పవిత్ర సినిమాలో వ్యభిచారిపాత్రలో ఒదిగిపోయింది. రాజకీయనాయకులు ఎంతకు దిగజారుతారో ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించగా శ్రీయ అద్భత నటనతో ఆకట్టుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించిన స్నేహ ఓ తమిళ సినిమాలో వ్యభిచారి పాత్రలో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఇక ఛార్మి తన లాస్ట్ సినిమాలో వ్యభిచారి పాత్రలో నటించింది. పూరి దర్శకత్వంలో జ్యోతిలక్ష్మి సినిమాలో వ్యభిచారం చేసే అమ్మాయిగా నటించింది. ఇక సదా తన సెకండ్ ఇన్నింగ్స్‌ను టార్చ్‌లైట్ సినిమాలో రోడ్ల పక్కన లారీడ్రైవర్ల కింద నలిగిపోయే పచ్చి వ్యభిచారి పాత్రలో నటించింది.
ఇవి కూడా చదవండి..