లవ్‌స్టోరీ బంగార్రాజు వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ తర్వాత మంచి జోష్ మీదున్న నాగచైతన్య. ప్రస్తుతం మానాడు ఫేం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. కస్టడీ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ ద్విభాషా సినిమాలో నాగ్ పోలీస్‌గా కనిపించనున్నారు. వచ్చే యేడాది ప్రథమార్థంలో విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. దీంతో ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ వేగంగా జరుగుతోంది. తాజాగా ఒక వార్త టాలీవుడ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.
డిజిటల్ రంగంలోకి అడుగుపెడుతున్న నాగ్ ధూత అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడని సమాచారం. సూపర్‌నేచురల్ హర్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్‌ను అమెజాన్ సంస్థ నిర్మించింది. ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వెబ్ సిరీస్‌లో నాగచైతన్య జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నాడట. అంతేకాకుండా ఆయన పాత్ర ఫుల్ నెగెటీవ్ షేడ్స్‌లో ఉంటుందట.
ఈ మూవీలో నాగచైతన్య నటన మరో స్థాయిలో ఉంటుందని చిత్రయూనిట్ చెబుతుంది. పార్వతి, ప్రియాభవాని శంకర్, ప్రచి దేశాయ్, తరుణ్ భాస్కర్ ఈ సినిమాలో కీలకపాత్రల్లో కనిపించున్నారు.
ఇవి కూడా చదవండి…