రెడ్డివారి అమ్మాయిలను పెళ్లాడుతున్న మన హీరోలు..

227
online news portal
- Advertisement -

రాంచరణ్, ఉపాసన రెడ్డి..అల్లు అర్జున్, స్నేహారెడ్డి.. మంచు విష్ణు, వెరోనికా రెడ్డి.. మంచు మనోజ్, ప్రణతి రెడ్డి..అఖిల్,శ్రేయాభూపాల్ రెడ్డి.. ఏంటి వీళ్లంతా అనుకుంటున్నారా? ఈ జంటల పేర్లు గమనిస్తుంటే మీకు ఏం అనిపిస్తుంది. మన హీరోలంతా రెడ్డి సామాజిక వర్గం అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారు. ఈ హీరోలే కాదు ఇలా ఇంకా చాలామంది టాలీవుడ్ హీరోలు రెడ్డి సమాజిక వర్గం అమ్మాయిలను వివాహం చేసుకున్నారు. అసలు ఈ రెడ్డి సెంటిమెంట్ ఏంటి? రాజకీయాల్లో ఇలాంటి సెంటిమెంట్ ఉంటే.. ఏ పదవుల కోసమో అనుకోవచ్చు. కానీ, సినిమా తారల విషయంలో ఇలా ఎలా వర్కౌట్ అయ్యింది. అంటే దీనికి ప్రత్యేకమైన కారణాలేవిలేవు.

online news portal

రాం చరణ్ అపోలో గ్రూప్ కి చెందిన ఉపాసన రెడ్డి ని పెళ్ళి చేసుకున్నాడు. ఆ తరువాత అల్లుఅర్జున్ తన ఫ్యామిలీ రిలేషన్స్ అయిన స్నేహా రెడ్డి ని పెళ్ళి చేసుకున్నాడు. మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు, వెరోనికా రెడ్డిని, మంచు మనోజ్, ప్రణతి రెడ్డిని వివాహం చేసుకున్నారు. ఈ రెండు జంటల్లో ఒకరికొకరు అంతకు ముందు పరిచయమున్నవారే. అంతేకాదు పెళ్లిళ్ల తరువాతే ఈ హీరోలకు కెరియర్ కూడా కలిసొచ్చింది.

online news portal

ఇక ఇప్పుడు ఈ జాబితాలోకి అక్కినేని నట వారసుడు అఖిల్ కూడా చేరుతున్నాడు. జివికే కుటుంబానికి చెందిన శ్రియా భూపాల్ రెడ్డి ని అఖిల్ వివాహం చేసుకోబోతున్నాడు. వచ్చే నెల9న ఈ జంట నిశ్చితార్థవేడుక జరుగబోతుంది. ఆ తరువాత రోమ్ లో గ్రాండ్ గా పెళ్లి చేయడానికి శ్రేయా భూపాల్ కుటుంబం ఏర్పాట్లు చేస్తోంది. ఇలా మెజారిటీ  హీరోలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం వెనక ఏదైన మతలాబు ఉందా అనే ఆలోచనలో పడ్డారు. అయితే దీన్ని ఓ సామాజిక వర‌్గానికి  చెందిన అంశంగా కాకుంగా,,ఆర్థిక స్తోమత అనే కోణంలో చూడాల్సి ఉంటుంది.  తమ ఆర్ధిక స్తోమకు సరితూగే వారిని,, లేదా అంతకు మించిన వారిని వివాహాం చేసుకోవడానికి హీరోలు,,,వారి కుటుంబ సభ్యులు  మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ పెళ్లిని డిసైడ్ చేసేది సామాజిక అంశం అనే దాని కన్నా,,,ఆర్ధిక పరిస్థితి అంటే బాగుంటుంది.

 

online news portal

బాలీవుడ్‌  మెగాస్టార్ కుమారుడు అబిషేక్ బచ్చన్‌ పెళ్లి విషయం చూసుకుంటే,,ఐశ్వర్య రాయ్ కూడా స్టార్ హీరోయిన్‌ కావడం,,అమ్మడు కూడా బాగానే సంపాదించడం వీరి పెళ్లికి ఎలాంటి అడ్డంకి లేకుండా చేసింది. నాగ చైతన్య పెళ్లి విషయాన్ని చూసుకున్నా ఇదే విషయం అర్ధం అవుతుంది. టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌గా రాణించిన సమంత కూడా అంతో ఇంతో సంపాదించడం పెళ్లికి సుగమం చేసింది. అర్ధిక స్తోమతలో,,,వియ్యంకుల వారికి సరితూగక పోతే ఎలా ఉంటుందో,,,తెలుగు హీరో ఉదయ్ కిరణ్ సంఘటన చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. ఆర్ధికపరంగా ఉదయ్ కిరణ్‌,,మెగాస్టార్ ఫ్యామిలీకి సరితూగే వాడు కాకపోవడమే,,పెళ్లిని మధ్యలో ఆపట్టే చేసింది. సో మొత్తానికి చూసుకుంటే,,హీరోల పెళ్లిలు సామాజిక అంశానికన్నా,,ఆర్దికంగానే ఎక్కువ ముడిపడి ఉంది. కాకపోతే పైన చెప్పుకున్న హీరోలకు యాధృచ్ఛికంగా అలా రెడ్డి అమ్మాయిలు దొరికారు.

- Advertisement -