నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న ఎన్టీఆర్ బయోపిక్ ను బాలకృష్ణ ప్రతిష్టాత్కకంగా నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ బయోపిక్ లో కీలకమైన పాత్రల కోసం టాలీవుడ్ – బాలీవుడ్ కు చెందిన పలువురు నటులను క్రిష్ – బాలయ్య ఎంపిక చేస్తున్నారు. ఆయా పాత్రకు సరిగ్గా సూట్ అయ్యేవారిని ఏరికోరి ఎంచుకుంటున్నారు.
అయితే ఈ సినిమా కోసం పేరున్న యాక్టర్స్‌నే ఎంచుకోవాలని బాలయ్య భావిస్తున్నారు. బసవతారకం పాత్రకుగానూ విద్యాబాలన్ ఖరారైంది. నారా చంద్రబాబునాయుడుగా రానా కనిపిస్తారు. ఏఎన్నార్ పాత్రకు గానూ నాగచైతన్య పేరు పరిశీలిస్తున్నారు. కృష్ణగా మహేష్‌బాబు కనిపిస్తారన్న ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. కృష్ణ పాత్రలో మహేష్‌ని చూడడం ఘట్టమనేని అభిమానుల్ని తప్పకుండా అలరించే విషయమే.
ఇక నందమూరి కుటుంబంతో అత్యంత సన్నిహితంగా ఉండే నటుడు మోహన్‌బాబు. ఈయన కూడా ఈ బయోపిక్‌లో కీలక పాత్రలో నటించనున్నాడని సమాచారం. అంతేకాదు హీరో రాజశేఖర్‌కీ ఓ పాత్ర దక్కిందని ముందు నుంచీ ప్రచారం జరుగుతోంది. అదేమిటన్నది ఇంత వరకూ తేలలేదు. వీరితో పాటు శర్వానంద్ లాంటి యువ కథానాయకుల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి.