సూపర్‌స్టార్ రికార్డు బద్దలు కొట్టిన మెగా పవర్‌స్టార్‌..

235
- Advertisement -

టాలీవుడ్‌ ఇండస్ట్రీ పరిగెడుతున్న కొద్దీ ఎప్పటికప్పుడు రికార్డులను సైతం క్రాస్ చేసుకుంటూ వెళుతోంది. చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని తేడా లేకుండా అన్ని చిత్రాలు ఇప్పుడు సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. రికార్డులు బద్దలు కొట్టడానికి కేవలం స్టార్ హీరో కావాల్సిన అవసరం లేదు. అయితే కొంత మంది స్టార్ హీరోలు క్రియేట్ చేసిన సరికొత్త రికార్డులను ఎవరు క్రాస్ చేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ చిత్రం ‘రంగస్థలం’ అలాంటి రికార్డులను బద్దలుకొట్టింది. హైదరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సుదర్శన్ 35 ఎంఎం సినిమా హాల్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

Rangasthalam

గతంలో ఈ రికార్డు మహేష్ బాబు నటించిన ‘పోకిరి’ పేరిట ఉండగా, దాన్ని ‘రంగస్థలం’ బ్రేక్ చేసింది. 12 సంవత్సరాల క్రితం విడుదలైన పోకిరి, సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ లో రూ.1,61,43,081 వసూలు చేసింది. ఇక రంగస్థలం విడుదలైన 89 రోజుల్లో రూ. 1.62 కోట్లు రాబట్టి సరికొత్త రికార్డును సృష్టించింది. అంతేకాదు ఇక కృష్ణా జిల్లాలోని ఒక థియేటర్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా ట్రెండ్ సెట్ చేసింది. తెలుగు సినిమా చరిత్రలోనే ఇప్పటివరకు ఒక థియేటర్‌లో ఎవరు అందుకొని కలెక్షన్స్ ఆ సినిమా అందుకుంది. అదే జిల్లాలో మహేష్ బాబు పోకిరి సినిమా కూడా రికార్డ్ క్రియేట్ చేసింది.

Rangasthalam

అయితే ఇప్పుడు అదే తరహాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక థియేటర్ లో అందరికంటే ఎక్కువ వసూళ్లను సాధించాడు. రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ గ్రాస్ అందుకున్న సినిమాగా నిలిచింది. ఇక నైజం ఏరియాలోని ఒక థియేటర్ లో రంగస్థలం అత్యధిక వసూళ్లను రాబట్టిందని సమాచారం. ఈ విధంగా సువర్ స్టార్ – పవర్ స్టార్ స్థాయిలో మెగా పవర్ స్టార్ రికార్డ్ అందుకున్నాడు. కాకపోతే అప్పటి సినిమా టికెట్ ధరలకు, ఇప్పటి ధరలకు ఎంతో తేడా ఉంది. అయినా రికార్డు రికార్డే కదా మరి.

- Advertisement -