నా తమ్ముడికి జగన్ అంటే చచ్చేంత ప్రేమః దర్శకుడు పూరీ జగన్నాథ్

162
Puri Jagannath

ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఏపీ కాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఇటివలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పూరీ జగన్నాథ్ సోదరుడు ఉమాశంకర్ గణేశ్ నర్సీపట్నం నుంచి వైఎస్సార్సీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. ఈ ఎన్నికల్లో ఉమా గణేశ్ 20వేల మెజార్టీతో గెలుపొందాడు. మంత్రి అయ్యన్నపాత్రుడు పై ఉమా శంకర్ గణేశ్ గెలుపొందాడు. ఇక తన సోదరుడు ఎమ్మెల్యేగా గెలుపొందడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు పూరీ.

నా తమ్ముడి విజయానికి కారణం జగన్ అంటూ ట్వీట్ చేశారు పూరీ. నాతమ్ముడికి జగన్ అంటే చచ్చేంత ప్రేమ అని తెలిపాడు. నా తమ్ముడికి ఇంత ఘనవిజయాన్ని అందించిన జగన్ కు నేను నాకుటుంబ ఎప్పటికి రుణపడి ఉంటామని తెలిపారు. నా సోదరుడు జగన్ ఫోటో చూసినా…వీడియో చూసిన చాలా సంతోషంగా ఫిలవుతాడు…ఉమాశంకర్ ఎందుకు ఎందుకు అలా ఫీలయేవాడో నాకిప్పుడు అర్థమైంది.

గత ఎన్నికల్లో నా తమ్ముడు ఓడిపోయినా, జగన్ మళ్లీ ధైర్యం చెప్పి వెన్నంటి ఉండి ఎమ్మెల్యేగా గెలిపించారు. వైఎస్ రాజశేకర్ రెడ్డి చనిపోయాక ఎన్నో అవమానాలు, అపోహాలలను ఎదుర్కొని ధైర్యంగా ముందుకు సాగి నేడు ఘన విజయాన్ని సాధించిన జగన్ నాకు సింహంలా కనిపిస్తున్నారని చెప్పారు.