యంగ్ హీరోయిన్లకు సినిమా ఇండస్ట్రీలో ఛాన్స్ లు రావాలి అంటే.. పీఆర్ ఉండాలి. పైగా వచ్చిన ఆ ఛాన్స్ లు నిలబడాలి అంటే.. టాలెంట్ ఉండాలి. అందుకే.. ఇండస్ట్రీలో హిట్లు తక్కువ ఉంటాయి. హిట్ అయిన హీరోయిన్లు కూడా తక్కువగానే ఉంటారు. అందుకే, ఆల్రెడీ హిట్ అయిన హీరోయిన్లకు ఆఫర్లు వెతుక్కుంటూ వస్తాయి. పెళిసందD ఫేమ్ శ్రీలీల ఒక్కో సినిమాకు కోటి కావాలంటూ తన కోరికల చిట్టాను నిర్మాతల మెడకు చుడుతోంది. అదేంటి ?, గత నెల వరకూ 50 – 60 లక్షలే కదా తీసుకుంది. మరీ అంతలోనే శ్రీలీల కి ఏం మార్కెట్ పెరిగిందని డౌట్ పడక్కర్లేదు. శ్రీలీల కు మార్కెట్ పెరగలేదు, మహేష్ సినిమాలో ఛాన్స్ వచ్చింది. అంతే !.
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో తాను హీరోయిన్ అనేసరికి శ్రీలీల ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. ఇక హీరోయిన్ గా తనకు తిరుగులేదు అనుకుని, తనకు బాగా డిమాండ్ ఉందని అపోహ పడి.. శ్రీలీల ఇప్పుడు ఏకంగా కోటి కావాలి, అవసరం అనుకుంటే కోటిన్నర కూడా ఇవ్వాల్సి ఉంటుంది అంటూ బేరాలు మొదలుపెట్టింది. మొత్తమ్మీద ఈ కుర్ర హీరోయిన్ గారి గొంతెమ్మ కోరికల దెబ్బకు నిర్మాతలు ఉలిక్కిపడుతున్నారు.
అయినా శ్రీలీల కు, మహేష్ సినిమాలో ఛాన్స్ వచ్చింది మెయిన్ హీరోయిన్ గా కాదు, సెకండ్ లీడ్ గా. అంతమాత్రానికే అడ్డు అదుపు లేకుండా తన రెమ్యునరేషన్ ను విచ్చలవిడిగా పెంచితే ఎలా ?,. ఐతే, ఈ విషయంలో శ్రీలీల చాలా క్లారిటీగా ఉంది. త్రివిక్రమ్ – మహేష్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ కన్ ఫార్మ్ అయింది కాబట్టి.. ఇక తనకు హిట్ ప్లాప్ తో పని లేదు అని ఫిక్స్ అయింది. ఎలాగూ శ్రీలీల కు గ్లామర్ విషయంలో ఫుల్ మార్క్ లు పడ్డాయి. కాబట్టి ఆమె కెరీర్ కు ఇప్పట్లో వచ్చే సమస్య అయితే ఏమీ లేదు.
ఇవి కూడా చదవండి…