ఏజెంట్ ఏమైపోయాడు ?

140
- Advertisement -

అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ ‘ఏజెంట్’ కి సంబంధించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వడం లేదు మేకర్స్. ఈ సినిమాకి ఇప్పటికే రెండు రిలీజ్ డేట్స్ ప్రకటించారు. తాజాగా సంక్రాంతి రిలీజ్ అంటూ ఎనౌన్స్ చేసి మళ్ళీ సైలెంట్ అయిపోయారు. ‘ఏజెంట్’ సంక్రాంతికి రిలీజ్ అవ్వడం కష్టమే అని అందరికీ తెలిసిందే. కానీ సినిమాపై హైప్ క్రియేట్ చేసి న్యూస్ లో ఉండేందుకు సడెన్ గా సంక్రాంతికి రిలీజ్ అంటూ ప్రకటించి బజ్ క్రియేట్ చేశారు.

ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ ఇంకా జరుగుతుంది. ముఖ్యంగా టెక్నికల్ గా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ టైం తీసుకుంటున్నారు. అఖిల్ మార్కెట్ కి నాలుగింతలు ఎక్కువ బడ్జెట్ పెట్టి మరీ సినిమాను లావిష్ గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఏజెంట్ రిలీజ్ విషయంలో ఆలస్యానికి మరో రీజన్ దర్శకుడు సురేందర్ రెడ్డి.

సురేందర్ రెడ్డి మేకింగ్ కి చాలా టైం తీసుకుంటాడు. సైరా నరసింహా రెడ్డి లాంటి హిస్టారికల్ పిరియాడిక్ సినిమా కోసం ఏళ్ళు తీసుకోవడం ఓకె కానీ అఖిల్ తో తీస్తున్న స్టైలిష్ యాక్షన్ సినిమాకు కూడా ఇంత టైం తీసుకోవడం రిలీజ్ డేట్స్ వాయిదా వేస్తూ ముందుకు నడిపించడం అక్కినేని ఫ్యాన్స్ కి కోపం తెప్పిస్తుంది. ప్రస్తుతానికి ఏజెంట్ కి సమ్మర్ ఒక్కటే ఛాయిస్ అనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి…

ధనుష్ కోసం మరో తెలుగు డైరెక్టర్ తాపత్రయం !

ఆ హీరో దెబ్బకు ముగ్గరు హీరోయిన్లు అవుట్ !

కృతి శెట్టి సంచలన నిర్ణయం.. ఇక వాటికి దూరం !

- Advertisement -