శ్రీనగర్‌లో జరుగుతున్న మూడవ టూరిజం జీ20 గ్రూప్ మీటింగ్‌కు టాలీవుడ్ మెగా హీరో రామ్‌చరణ్ పాల్గొననున్నారు. ఈ ఉదయం హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి శ్రీనగర్‌కు బయలుదేరాడు. టూరిజం వర్కింగ్ గ్రూప్ మీట్‌లో ఫిల్మ్ టూరిజం ఫర్ ఎకనామిక్ గ్రోత్ అండ్ కల్చరల్ ప్రిజర్వేషన్‌పై వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులతో చర్చించనున్నారు. ఈ చర్చలో భారత్ నుంచి నటుడు హాజరుకావడం ఇదే తొలిసారి.
Also Read: తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్ కేటీఆర్..
నేటి నుంచి మూడు రోజులపాటు ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. మొత్తం 60మందికిపైగా విదేశీ ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. శ్రీనగర్‌లోని దాల్ సరస్సుతోపాటు సమావేశానికి వేదిక అయిన షేర్-ఏ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌కు వెళ్లే రహదారుల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. పారామిలిటరీ బలగాలు, ఎన్‌ఎస్జీ కమాండోలు, పోలీసులు మోహరించారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆదీనంలోకి తీసుకున్నారు.
Also Read: బ్యాంక్ అకౌంట్ లేకపోయినా రూ.2వేలు మార్చుకోవచ్చు