ఔటర్ రింగ్ రోడ్డు పై టోల్ చార్జీల పెంపు..

16
- Advertisement -

ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ ఛార్జీలు పెంచారు. 5 శాతం టోల్ ఛార్జీలు పెంచింది హెచ్‌ఎండీఏ. దేశ వ్యాప్తంగా ఉన్న టోల్ భూత్స్ లో ఛార్జిలు పెరిగాయి. దేశ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జాతీయ రహదారుల టోల్ ప్లాజాల్లో ఆరు శాతం చార్జీలను పెంచారు.

దీంతో ఔటర్ రింగ్ రోడ్డుపై కూడా చార్జీలను పెంచింది టోల్ అభివృద్ధి సంస్థ. కారు, జీపు,వ్యాన్ కు కిలోమీటరు కి 2.44 రూపాయలు..Lcv, మిని బస్ కు 3.94రూపాయలు పెరిగాయి.

బస్, ట్రక్ కు 7 రూపాయలు పెరుగగా 3 యాక్సిల్ వాణిజ్య వాహనం 9.01 రూపాయలు, భారీ నిర్మాణ మిషనరీ, ఎర్త్ మూవింగ్ ఎక్విప్మెంట్ 4,5,6 యాక్షిల్ ట్రక్ కు 12.96 రూపాయలు, భారీ సైజు వాహనాలకు 15.78 రూపాయలు పెంచారు.పెరిగిన ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి.

Also Read:వేసవిలో ముంజలు..అస్సలు వదలరు!

- Advertisement -