నేటి నుండే టోక్యో పారా ఒలింపిక్స్‌..

68
tokyo

నేటి నుండి పారా ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి. జపాన్ రాజధాని టోక్యో వేదికగా పారా ఒలింపిక్స్‌ ప్రారంభంకానుండగా మొత్తం 163 దేశాల నుంచి 4500 మంది పారా అథ్లెట్లు పాల్గొననున్నారు. కరోనా నేపథ్యంలో పారా ఒలింపిక్స్‌కు అన్ని సిద్ధం చేశారు. 22 క్రీడాంశాల్లో 540 ప‌త‌క ఈవెంట్లు జ‌ర‌గ‌బోతున్నాయి.

ఇక భార‌త్ నుంచి 54 మంది పారా అథ్లెట్లు టోక్యో పారా ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నారు. టోక్యో ఒలింపిక్స్‌తో భారత్ 7 ప‌త‌కాలు సాధించి భ‌విష్య‌త్తులో మ‌రిన్ని ప‌త‌కాలు సాధించే స‌త్తా ఉంద‌ని నిరూపించింది.