టోక్యో పారాలింపిక్స్‌.. భారత్‌కు మరో రెండు పతకాలు..

234
- Advertisement -

టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్ 2020లో భారత పారా అథ్లెట్ల జోరు కొనసాగుతున్నది. ఇప్పటికే 8 పతకాలు సాధించిన అథ్లెట్లు తాజాగా మంగళవారం మరో రెండు పతకాలు సాధించారు.పురుషుల హైజంప్ ఈవెంట్లో మరియప్పన్ తంగవేలు రజతం గెలుచుకోగా, అదే క్రీడాంశంలో శరద్ కుమార్ కాంస్యం గెలిచాడు. ఈ రెండు పతకాల అనంతరం భారత్ సాధించిన పతకాల సంఖ్య 10కి పెరిగింది.

కాగా, మరియప్పన్ తంగవేలు, శరద్ కుమార్ లను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. నిలకడకు, ప్రతిభకు మరియప్పన్ తంగవేలు పర్యాయపదం వంటివాడని కొనియాడారు. అతడు గెలిచిన రజతం పట్ల దేశం గర్విస్తోందని తెలిపారు. ఇక, కాంస్యం గెలిచిన శరద్ కుమార్ గురించి ప్రస్తావిస్తూ, తన ప్రదర్శన ద్వారా ప్రతి ఒక్క భారతీయుడి మోములో సంతోషం నింపాడని పేర్కొన్నారు.

భారత అథ్లెట్లు సాధించిన పతకాలు..
-అవని లేఖర: స్వర్ణ పతకం – మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ – ఎస్‌హెచ్1
-సుమిత్ అంటిల్ : స్వర్ణ పతకం – పురుషుల జావెలిన్ త్రో – ఎఫ్64
-యోగేశ్ కథూనియా : రజత పతకం – పురుషుల డిస్కస్ త్రో – ఎఫ్56
-నిషాద్ కుమార్ : రజత పతకం – పురుషుల హై జంప్ – టీ47
-మరియప్పన్ తంగవేలు : రజత పతకం – పురుషుల హైజంప్ – టీ63
-దేవేంద్ర : రజత పతకం – పురుషుల జావెలిన్ త్రో – ఎఫ్46
-భవానీబెన్ పటేల్ : రజత పతకం – మహిళల టేబుల్స్ టెన్నిస్ – క్లాస్ 4
-శరద్ కుమార్ : కాంస్య పతకం – పురుషుల హైజంప్ – టీ63
-సుందర్ సింగ్ గుర్జార్ : కాంస్య పతకం – పురుషుల జావెలిన్ త్రో – ఎఫ్46
-సింగ్‌రాజ్ అధాన : కాంస్య పతకం – పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ – ఎస్‌హెచ్ 1

- Advertisement -