మూడో రౌండ్‌లో శరత్‌ కమల్‌..

67
sharath

టోక్యో ఒలింపిక్స్‌లో ఆదివారం భారత అథ్లెట్లు మిశ్రమ ఫలితాలను అందించారు. బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు తన తొలి మ్యాచ్‌లో విజయం సాధించగా, బాక్సర్‌ మేరీ కోమ్ ప్రి క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది. అయితే షూటింగ్‌తో పాటు స్విమ్మింగ్‌లో భారత క్రీడాకారులు నిరాశ పర్చారు.

ఇక టేబుల్‌ టెన్నిస్‌ పురుషుల రెండో రౌండ్‌లో ఆచంట శరత్‌ కమల్‌ విజయం సాధించాడు. పోర్చుగల్ ప్లేయర్ అపోలోనియా టియాగోపై 4-2 తేడాతో చారిత్రక విజయం సొంతం చేసుకున్నాడు.

ఒలింపిక్స్‌ ఆర్చరీ పురుషుల విభాగంలో భారత జట్టు క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. ప్రవీణ్‌ జాదవ్‌, అతను దాస్‌, తరుణ్‌దీప్‌ రాయ్‌తో కూడిన ఇండియన్‌ ఆర్చరీ టీం ఎలిమినేషన్‌లో కజకిస్థాన్‌పై విజయం సాధించింది. నాలుగో రోజైన సోమవారం భారత ఆటగాళ్లు మొత్తం 10 విభాగాల్లో పోటీ పడనున్నారు.