ఆర్చరీ మెన్స్‌ .. క్వార్టర్స్‌ చేరిన భారత్‌

97
archary

టోక్యో ఒలింపిక్స్‌ ఆర్చరీ పురుషుల విభాగంలో భారత జట్టు క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. ప్రవీణ్‌ జాదవ్‌, అతను దాస్‌, తరుణ్‌దీప్‌ రాయ్‌తో కూడిన ఇండియన్‌ ఆర్చరీ టీం ఎలిమినేషన్‌లో కజకిస్థాన్‌పై విజయం సాధించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది.

6-2తో కజకిస్థాన్‌పై భారత్ గెలుపొందగా భారత ఆర్చరీ త్రయానికి కజక్‌ ఏ మాత్రం పోటీనివ్వలేకపోయింది. అంతకుముందు ఫెన్సింగ్‌ మహిళల వ్యక్తిగత విభాగంలో భారత ఫెన్సర్‌ భవానీ దేవి ఘన విజయం సాధించింది. టునీషియాకు చెందిన నాజియా బెన్‌ అజిజ్‌పై 15-3 పాయింట్ల తేడాతో విన్‌ అయ్యింది. మ్యాచ్‌ ప్రారంభమైన 6 నిమిషాల్లోనే భవానీ దేవి గెలుపును సొంతం చేసుకుంది. దీంతో ఒలింపిక్స్‌ నాలుగో రోజు భారత్‌ శుభారంభం పలికినట్లయింది.