ఇదేంటి టాయ్ లెట్ నీటితో టీ తయారు చేయడం ఏంటి అనుకుంటున్నారా…అవును..ఇది నిజం. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనతో అంతా ముక్కున వేలు వేసుకుంటున్నారు. సాధారణంగా ట్రైన్‌లో ప్రయాణిస్తున్న సమయంలో టీ లేదా స్నాక్స్,సమోసా లాంటివి తినడం అలవాటు. ఇటీవల సోషల్ మీడియా పుణ్యమాని రైల్వే స్టేషన్,బస్ స్టేషన్,బయట అమ్మె సమోలు తింటే ఆరోగ్యం పాడవుతుందనే అవేర్‌నెస్ వచ్చింది. దీంతో తినుభండారాలకు దూరంగా ఉంటున్నారు.
అయితే,కనీసం టీ తాగుదామని అనుకున్న దానిని కూడా వదలట్లేదు. ఎందుకంటే ఈ వీడియో చూస్తే జీవితంలో మీరు రైల్లో టీ త్రాగరేమో. ఓ టీ అమ్మకందారు, తన టీ క్యాన్ లోకి టాయిలెట్ లో వస్తున్న నీటిని పట్టుకుంటుండగా, వీడియో తీసిన ఓ ప్రయాణికుడు దాన్ని సోషల్ మీడియాలో పెట్టాడు. అది కాస్తా వైరల్ కావడంతో రైల్వే అధికారుల దృష్టికి వెళ్లింది. దాంతో అధికారులు అతనిపై రూ. లక్ష జరిమానాతో పాటు అతడి లైసెన్స్ ను రద్దు చేశారు. గతేడాది డిసెంబర్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది.