తెలంగాణలో భారీ వర్షాలు…

290
rains
- Advertisement -

ఎండవేడిమితో అతలాకతలం అవుతున్న ప్రజలకు కాస్త రిలీఫ్ లభించింది. హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. కుత్బుల్లాపూర్,నాంపల్లి,కోఠి,ఖైరతాబాద్,అబిడ్స్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వరంగల్-ములుగు మార్గంలో రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి.

వరంగల్ అర్బన్‌, ఖమ్మం, మహబూబాబాద్, పెద్దపల్లి, సిద్ధిపేట, హుస్నాబాద్, గజ్వేల్లో వర్షాల ధాటికి విద్యుత్‌ సరఫరా నిలిపోయింది. భారీ వర్షాల కారణంగా సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేస్తున్నారు. జనగాం జిల్లా కేంద్రంలో ఈదురు గాలులతో కూడిన వర్షంతో జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం తడిసి ముద్దయింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో అకాల వర్షం ధాటికి వరి, మక్క, మామిడి తోటలు దెబ్బతిన్నాయి.

ఈదురు గాలుల‌తో కూడిన వ‌డ‌గ‌ళ్ల వాన కుర‌వ‌డంతో జ‌నం తీవ్ర ఇబ్బందులు ప‌డ్డారు. వ‌రంగ‌ల్ న‌గ‌రంలో రోడ్ల‌పై భారీగా వ‌ర్ష‌పు నీరు చేర‌డంతో ర‌వాణ‌, విద్యుత్ వ్య‌వ‌స్థ‌లు స్థంబించాయి. రోడ్లపైన విరిగిపడ్డ చెట్లను తొలగించి, విద్యుత్ స్తంబాలు, తీగలను పునరుద్ధరించాలని జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి, నగర కమీషనర్ గౌతమ్ అధికారులను ఆదేశించారు. టోల్ ఫ్రీ నెంబర్ 8004251980 నెంబర్ కి కాల్ చేసి తెలియజేయవచ్చని కలెక్టర్ ఆమ్రపాలి తెలిపారు.

వరంగల్ అర్బన్ 5 సెం.మీ, వరంగల్ రూరల్ 4 సెం.మీ, భూపాలపల్లి 4 సెం.మీ, దామెర, ములుగు 3.6 సెం.మీ వర్షపాతం,ఉప్పలగూడెం (మహబూబాబాద్) 2.1 సెం.మీ, వర్షంపాతం నమోదయింది.

- Advertisement -