స్థిరంగా బంగారం ధర.. పెరిగిన వెండి ధరలు..

63

బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్న వేళ.. బులియన్‌ మార్కెట్లో మంగళవారం వెండి ధరలు మాత్రం పెరిగాయి. మార్కెట్ డిమాండ్, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిస్థితుల ఆధారంగా బంగారం ధరలో హెచ్చుతగ్గులకు కారణం అయింది. తాజాగా మంగళవారం (అక్టోబర్‌ 5)న హైదరాబాద్​లో 10 గ్రాముల బంగారం ధర రూ 43, 510 గా ఉంది. చాలా నగరాలలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. కానీ, వెండి ధర కిలోకి మాత్రం రూ. 200 వరకు పెరిగింది. ఆయా ప్రాంతాలను బట్టి ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఇక దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,510 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,470 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,510 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,470 ఉంది. విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,510 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.47,470 ఉంది.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,800 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,820 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,800 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,490 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,490 ఉంది.

ఇక వెండి విషయానికొస్తే.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.64,800 ఉండగా, విజయవాడలో రూ. 64,800 వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి రూ.60,500 ఉండగా, చెన్నైలో రూ.64,800 ఉంది. ముంబైలో కిలో వెండి రూ.60,500 ఉండగా, కోల్‌కతాలో రూ.60,500 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.60,500 ఉండగా, కేరళలో రూ.64,800 ఉంది.