బిగ్ బాస్ 5: 30వ ఎపిసోడ్‌ హైలైట్స్‌

58

బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ 19 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైంది. టాలీవుడ్‌ కింగ్‌ అక్కినేని నాగార్జున సెప్టెంబర్‌ 5న ఈ షోను ప్రారంభించాడు. షో మొదలైన తొలి రోజే 18 టీఆర్పీ రేటింగ్‌ సొంతం చేసుకుని విజయవంతంగా ప్రారంభమైంది బిగ్‌బాస్‌. ఇక నాలుగు వారాలు పూర్తి చేసుకొని 5వ వారంలోకి అడుగుపెట్టింది. సోమవారం నాటి 30వ ఎపిసోడ్‌కి వచ్చేసరికి నలుగురు ఎలిమినేట్ అయ్యి.. కేవలం 15 మంది మాత్రమే మిగిలారు. సోమవారం నాటి ఎపిసోడ్ ఎలా జరిగిందో చూద్దాం…

బిగ్ బాస్ ప్రతివారం మాదిరిగా కాకుండా ఈవారం నామినేషన్స్ కాస్త డిఫరెంట్‌గా ప్లాన్ చేశారు.. ఒక్కొక్కరు ఇద్దరిద్దరిద్దర్ని నామినేట్ చేయడం అనేది రొటీన్ కాగా.. అయితే నామినేషన్ డైరెక్ట్‌గా కాకుండా కన్ఫెషన్ రూం నుంచి నామినేట్ చేయాలని చెప్పారు బిగ్ బాస్. మొదటి జెస్సీతో ఈ నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ఎవరు ఎవర్ని నామినేట్ చేశారంటే..

-షణ్ముఖ్ జస్వంత్.. విశ్వ, మానస్‌లను నామినేట్ చేశాడు.
-హమీదా.. ప్రియ, షణ్ముఖ్ జస్వంత్ లను నామినేట్ చేశాడు.
-శ్వేతా.. మానస్, కాజల్ లను నామినేట్ చేశాడు.
-ప్రియ.. షణ్ముఖ్ జస్వంత్, సన్నీ లను నామినేట్ చేశాడు.
-మానస్.. జెస్సీ, షణ్ముఖ్ జస్వంత్‌లను నామినేట్ చేశాడు.
-శ్రీరామ్.. జెస్సీ, షణ్ముఖ్ జస్వంత్ లను నామినేట్ చేశాడు.
-జస్వంత్ (జెస్సీ).. యాంకర్ రవి, లోబోలను నామినేట్ చేశాడు.
-సన్నీ.. షణ్ముఖ్, ప్రియ లను నామినేట్ చేశాడు.
-విశ్వ.. జెస్సీ, షణ్ముఖ్ జస్వంత్ లను నామినేట్ చేశాడు.
-కాజల్.. యాంకర్ రవి, సన్నీలను నామినేట్ చేశాడు.
-లోబో.. మానస్, షణ్ముఖ్ లను నామినేట్ చేశాడు.
-ప్రియాంక.. హమీదా, లోబోలను నామినేట్ చేశాడు.
-సిరి.. యాంకర్ రవి, హమీదాలను నామినేట్ చేశాడు.
-యాంకర్ రవి.. జెస్సీ, షణ్ముఖ్ జస్వంత్లను నామినేట్ చేశాడు.
-ఆనీ మాస్టర్.. యాంకర్ రవి, విశ్వలను నామినేట్ చేశాడు.

ఈ నామినేషన్ ప్రక్రియలో షణ్ముఖ్‌ను ఎక్కువగా నామినేషన్ చేశారు. అందరికి రెండు మూడు ఓట్లతో నామినేట్ కాగా.. షణ్ముఖ్‌కి ఏకంగా 8 ఓట్లు వచ్చాయి. సన్నీ, విశ్వ, లోబో, రవి, హమీదా, ప్రియ, మానస్, శ్రీరామ్ ఈ ఎనిమిది మంది షణ్ముఖ్‌ని నామినేట్ చేయడం విశేషం. బిగ్ బాస్ హిస్టరీలో ఒకే వారంలో 9 మంది నామినేట్ కావడం కావడంతో పాటు.. ఒక కంటెస్టెంట్‌ని ఏకంగా ఎనిమిది మంది కంటెస్టెంట్లు నామినేట్ చేయడం ఇదే తొలిసారి.

  1. లోబో (జెస్సీ, ప్రియాంకలు నామినేట్ చేశారు)
  2. సన్నీ (కాజల్, ప్రియ నామినేట్ చేశారు)
  3. విశ్వ (ఆనీ, షణ్ముఖ్ నామినేట్ చేశారు)
  4. హమీదా (ప్రియాంక, సిరి నామినేట్ చేశారు)
  5. మానస్ (లోబో, శ్వేతా, షణ్ముఖ్ నామినేట్ చేశారు)
  6. ప్రియ (సన్నీ, హమీదా నామినేట్ చేశారు)
  7. జెస్సీ (విశ్వ, రవి, మానస్, శ్రీరామ్ నామినేట్ చేశారు)
  8. యాంకర్ రవి (జెస్సీ, కాజల్, సిరి, ఆనీ నామినేట్ చేశారు)
  9. షణ్ముఖ్ జస్వంత్ (సన్నీ, విశ్వ, లోబో, రవి, హమీదా, ప్రియ, మానస్, శ్రీరామ్ నామినేట్ చేశారు)

అయితే షణ్ముఖ్‌ని ఒకేసారి ఎనిమిది మంది నామినేట్ చేయడంతో షాక్ అయ్యాడు. మొదట తనని ఎవరూ నామినేట్ చేయడం లేదని కన్ఫెషన్ రూంలో చెప్పిన షణ్ముఖ్.. బయటకు వచ్చిన తరువాత ఇప్పుడు చూపిస్తా నా ఆట ఏంటో అని సవాల్ చేశాడు. అయితే ఆ తరువాత శ్రీరామ్‌తో జెస్సీ విషయంలో గొడపడుతూ కనిపించాడు. విషయం తెలియకుండా మధ్యలోకి దూరిపోయి.. అడ్డంగా వాదిస్తూ.. నా రూల్ బుక్ ప్రకారం ఫ్రెండ్ కోసం గొడవపడాలంటే విషయం తెలియాల్సిన అవసరం లేదంటూ గొడవపడ్డాడు. పనులు చేయకపోతే ఎవరి ఫుడ్ వాళ్లు వండుకోండి అని జెస్సీతో అన్నాడు శ్రీరామ్.. ఆ మాటతో జెస్సీతో పాటు షణ్ముఖ్, సిరిలు చెలరేగిపోయారు. అసలు నువ్ ఎవరివి.. ఫుడ్ లేదని చెప్పడానికి? ఇది బిగ్ బాస్ హౌస్‌ అంటూ సిరి శివాలెత్తింది. అసలే సిరి.. ఆపై షణ్ముఖ్ ఫీల్ అయ్యేడనే సరికి అసలు తట్టుకోలేకపోయింది.. ఫుడ్ ఎందుకు పెట్టరు.. వీళ్ల ఆర్డర్లు ఏంటి?? ఒకరికి ఒకలా మాకు ఒకలా పెడుతున్నారంటూ ఫైర్ అయిపోయింది.