మళ్లీ పెరిగిన పసిడి ధర..

36
gold

బంగారం ధరలు రోజు రోజు పైపైకి వెళ్లుతున్నాయి. ఈ నేపథ్యంలో పసిడి ధర మళ్లీ పెరిగే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. దేశంలో కరోనాకి వ్యాక్సిన్ జనవరి 16 నుంచి వేయబోతున్నారు. అందువల్ల ఆర్థిక వ్యవస్థ మరింత పుంజుకుంటుంది. తద్వారా పెద్ద ఎత్తున డబ్బు ప్రజల మధ్య పంపిణీ అవుతుంది. దాంతో… బంగారం కొనుగోళ్లు పెరుగుతాయి. అందువల్ల బంగారానికి మంచి రోజులు వచ్చినట్లే అంటున్నారు ఇన్వెస్టర్లు.

ఈరోజు హైదరాబాద్ లోని బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 46,310 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ.50,510 కి చేరింది ఇక వెండి ధర మాత్రం ఈరోజు స్థిరంగా ఉంది. కిలో వెండి ధర రూ.69,000కి పలుకుతుంది.

వెండి ధరలు వెండి ధరలు మూడు రోజుల్లో రూ.5,500 తగ్గి… తాజాగా స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.69,000 ఉంది. నిన్నటికీ ఇవాళ్టికీ ధరలో మార్పు లేదు. తులం వెండి ధర ప్రస్తుతం రూ.552 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధరలో మార్పు లేదు.