వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై ప్రధాని మోదీ సమీక్ష..

31
modi

దేశంలో ఈ నెల 16న కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ రోజు వ్యాక్సినేషన్‌ సన్నద్ధతపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష సమావేశం నిర్వహించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా మొదటి దశలో 3 కోట్ల మంది హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు టీకా ఇవ్వనున్నటు కేంద్రం వెల్లడించారు. తరువాత 50 ఏళ్ల పైబడినవారు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 27 కోట్ల మందికి వ్యాక్సిన్ అందివ్వనున్నారు. ఈ సమావేశంలో క్యాబినెట్ కార్యదర్శి, ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ, హెల్త్ సెక్రటరీ, ఇతర సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.