తగ్గిన బంగారం ధరలు..

98
gold

బంగారం ధరలు గతవారం పదిరోజులుగా హెచ్చుతగ్గులు నమోదు అవుతున్నాయి. తాజాగా బంగారం ధరలు శుక్రవారం దిగివచ్చాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్ )లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములు రూ.50,635కు తగ్గింది. వెండి కిలో ప్యూచర్స్ రూ.61,650కి పెరిగింది. ఇంతకుముందు సెషన్‌లో పసిడి 0.3 శాతం పెరిగాయి. వెండి ధరలు 0.3 శాతం క్షీణించింది. ఇక హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.52,740 పలికింది. 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.48,310 పలికింది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ.53,730, 22 క్యారెట్ల పసిడి రూ.49,250 పలికింది.