రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు బ‌తుక‌మ్మ శుభాకాంక్ష‌లు: సీఎం కేసీఆర్

210
kcr

రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సీఎం కేసీఆర్ బ‌తుక‌మ్మ పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రజలు పండుగ జరుపుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఆత్మ‌గౌర‌వ ప్ర‌తీక‌గా, తెలంగాణ సాంస్కృతిక వైభ‌వానికి చిహ్నంగా నిలుస్తున్న బ‌తుక‌మ్మ పండుగ‌ను ప్ర‌జ‌లు భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకోవాల‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. పంట‌లు బాగా పండి వ్య‌వ‌సాయం గొప్ప‌గా వ‌ర్ధిల్లాలి అని ఆకాంక్షించారు. ప్ర‌తి ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరిసేలా దీవించాల‌ని అమ్మ‌వారిని సీఎం కేసీఆర్ ప్రార్థించారు.

తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ పండుగ. పసుపు పచ్చని తంగేడు.. తెల్లని గునుగు సహా తీరొక్క పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి.. వాకిళ్లలో సంప్రదాయ వస్త్రాలతో యువతులు గుంపులు గుంపులుగా చేరి ఆడిపాడే పండుగ వచ్చేసింది. బతుకమ్మ సంబురాలతో రాష్ట్రంలో పల్లెలు తొమ్మిది రోజుల పాటు కళకళలాడనున్నాయి. శుక్రవారం ఎంగిలి పూల బతుకమ్మతో మొదలయ్యే ఉత్సవాలు, సద్దుల బతుకమ్మ దాకా కొనసాగుతాయి.