మరింత దిగొచ్చిన బంగారం ధర…

167
akshaya tritiya 2020
- Advertisement -

బంగారం ధర మరింత దిగొచ్చింది.హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.40 త‌గ్గి.. రూ.46,230గా ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం కూడా అదేస్థాయిలో.. రూ.40 త‌గ్గ‌డంతో.. రూ.50,840కు ప‌డిపోయింది.

బంగారం బాటలోనే వెండి కూడా స్వల్పంగా తగ్గింది. కిలో వెండి ధర రూ.50 త‌గ్గి రూ.48,500కు చేరింది. అంత‌ర్జాతీయ మార్కెట్‌లోనూ పుత్త‌డి త‌గ్గుముఖం ప‌ట్టింది.బంగారం ధర ఔన్స్‌కు 0.18 శాతం త‌గ్గ‌డంతో.. ఔన్స్‌కు 1786 డాలర్లకు పడిపోయింది.

కొద్దికాలంగా బంగారం ధర ఆల్‌టైం హైరికార్డుకు చేరగా వరుసగా తగ్గుముఖం పడుతుండటం బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఊరట క‌లిగిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధ‌ర‌ల ప్ర‌భావంతో దేశీయ మార్కెట్‌లో పుత్త‌డి ధ‌ర త‌గ్గింద‌ని మార్కెట్ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

- Advertisement -