ఎంత తిన్న సన్నగానే ఉన్నారా?

26
- Advertisement -

నేటి రోజుల్లో చాలమంది అధిక బరువుతో సతమతమౌతుంటే మరికొంతమంది బరువు పెరిగేందుకు ఆరాటపడుతుంటారు. ఎందుకంటే కొంతమంది ఎంత తిన్న ఏం తిన్న ఉండాల్సిన వెయిట్ కంటే చాలా తక్కువ బరువు కల్గి ఉంటారు. అలాంటి వారు బరువు పెరిగేందుకు చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. అయినప్పటికి బరువు పెరగకపోవడం వారిలో తీవ్ర నిరుత్సాహనికి గురి చేస్తుంది. సన్నగా ఉండడం వల్ల ఇతరులతో పోటీ పడడంలో కూడా వెనకడుగు వేస్తుంటారు. అయితే సన్నగా ఉన్నవారు బరువు పెరగడానికి మెడిసిన్స్ ద్వారా కాకుండా సహజసిద్ద మార్గాల ద్వారా వెళ్ళడం ఉత్తమం అని ఆహార నిపుణులు చెబుతున్నారు. అందుకోసం తినే ఆహార పదార్థాల విషయంలో సరైన జాగ్రత్తలు పాటిస్తే.. తక్కువ సమయంలోనే వేయిట్ పెరిగే అవకాశం ఉందట.

ప్రతిరోజూ పాలు, గుడ్డు, ఖర్జూరాలు, పీనట్, వంటి ఆయా ప్రోటీన్ పదార్థాలను తినడం వల్ల త్వరగా బరువు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు ఆహార నిపుణులు. వీటితో పాటు ఎండు కొబ్బరి, ఎండు ద్రాక్ష, వంటివి కూడా బరువు పెరిగేందుకు సహకరిస్తాయట. ఎండు కొబ్బరిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు పెరగడంలో ఉపయోగ పడుతుంది. అలాగే పాలు, గుడ్డు అనేవి అత్యధిక పోషక విలువలున్న పదార్థాలు. కాబట్టి ప్రతిరోజూ ఒక గ్లాస్ పాలలో ఖర్జూరాలను నానబెట్టి తినడం వల్ల శరీర కండరాలు శక్తినొందుతాయట. పాలలో ఉండే ప్రోటీన్స్, ఖర్జూరాల్లో ఉండే మాంగనీస్, పీచు.. వంటి సమ్మేళనలు వేగంగా బరువు పెరగడంలో దోహద పడతాయి. ఇక ప్రతిరోజూ ఉదయం పూట కాఫీ టీ వంటి వాటికి బదులుగా బనానా షేక్, బాదం షేక్.. వంటివాటిని సేవించడం ద్వారా కండర పుష్టి వేగంగా లభిస్తుంది. కాబట్టి ఎంత తిన్న బరువు పెరగని వారు పైన చెప్పబడిన వాటిని డైలీ ఆహార డైట్ లో చేర్చుకుంటే వేగంగా బరువు పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Also Read:Jagan:టార్గెట్ లోకేష్..జగన్ ప్లాన్ అదే?

- Advertisement -