Jagan:టార్గెట్ లోకేష్..జగన్ ప్లాన్ అదే?

10
- Advertisement -

టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను వైసీపీ టార్గెట్ చేస్తోందా ? మరోసారి మంగళగిరిలో అతనిని ఓడించే వ్యూహరచన చేస్తోందా ? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఈసారి మంగళగిరిలో గెలుపుపై లోకేష్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చవి చూశారు. అ తరువాత నుంచి నియోజక వర్గంపై స్పెషల్ ఫోకస్ పెడుతూ మళ్ళీ అదే స్థానం నుంచి పోటీ చేయబోతున్నట్లు మొదటి నుంచి చెబుతూ వచ్చారు. ప్రస్తుతం మంగళగిరిలో లోకేష్ హవా గట్టిగానే కొనసాగుతోంది. ఈసారి అక్కడ లోకేష్ గులుపు ఖాయమని సర్వేలు కూడా అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో లోకేష్ కు చెక్ పెట్టేందుకు వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. .

గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి వైసీపీ తరుపున ఆళ్ల రామకృష్ణ రెడ్డి గెలుపొందారు. అయితే ఆమద్య ఆళ్ల రామకృష్ణరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పిన సంగతి విధితమే. దీంతో ఈసారి మంగళగిరి నుంచి లోకేశ్ కు పోటీగా ఎవరు బరిలోకి దిగుతారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం మంగళగిరిలో వైసీపీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. దాంతో సర్వేల ఆధారంగా స్థానిక నేతను బరిలో దించేందుకు జగన్ ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి. లోకల్ నేత కావడం వైసీపీకి ప్లేస్ అవుతుందనే ఉద్దేశ్యంతో స్థానిక నేతలు టికెట్ కేటాయించే ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గంజి చిరంజీవి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. గతంలో ఆయన టీడీపీ నుంచి వైసీపీ గూటికి చేరారు. గంజి చిరంజీవికి కూడా మంగళగిరి నియోజక వర్గంలో స్థానిక బలం బాగానే ఉండడంతో లోకేశ్ కు చెక్ పెట్టేందుకు ఆయననే బరిలోకి దించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి లోకేష్ దూకుడికి అడ్డుకట్ట వేసేందుకు జగన్ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.

Also Read:హ్యాపీ బర్త్ డే…బాపు కేసీఆర్

- Advertisement -