మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ తగ్గిందా ?

19
- Advertisement -

నేటిరోజుల్లో క్రెడిట్ కార్డ్ వాడకం రోజు రోజుకు పెరుగుతోంది. ఎందుకంటే అత్యవసర పరిస్థితుల్లో చేతిలో నగదు లేని సమయాన క్రెడిట్ కార్డ్ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి రకరకాల బిల్లులు చెల్లిస్తుంటాము. ఆన్లైన్ లో మనకు నచ్చిన వస్తువులను కొనుక్కుంటూ ఉంటాము. ఇక క్రెడిట్ కార్డును ఎన్నో రకాలుగా వినియోగిస్తుంటాము. అయితే కొన్ని సందర్భాలలో మనయొక్క క్రెడిట్ కార్డ్ యొక్క మినిమమ్ లిమిట్ ఆటోమాటిక్ గా తగ్గిపోతుంటుంది. అలాంటి సందర్భాల్లో ఎందుకిలా జరిగింది అనే సందేహం రాక మానదు. అయితే క్రెడిట్ కార్డ్ లిమిట్ తగ్గడానికి కొన్ని కారణాలు ఉన్నాయి అవేంటో ఒకసారి చూద్దాం !

క్రెడిట్ కార్డ్ యాక్టివ్ గా లేకపోవడం.. కొంతమంది దగ్గర క్రెడిట్ కార్డ్ ఉన్నప్పటికి దానిని చాలా రోజులు ఇన్ యాక్టివ్ లో ఉంచుతుంటారు. అంటే క్రెడిట్ కార్డ్ ద్వారా ఎలాంటి లావాదేవీలు జరపకపోవడంతో ఆ క్రెడిట్ కార్డ్ ఇన్ యాక్టివ్ గా మారుతుంది. దాంతో క్రెడిట్ కార్డ్ యొక్క లిమిట్ తగ్గే అవకాశం ఉంది. కాబట్టి క్రెడిట్ కార్డ్ ను ప్రతినెలా గాని లేదా మూడు నెలలకు ఒకసారి గాని యాక్టివ్ గా ఉండేలా చూసుకోవాలి. అంటే ఆ క్రెడిట్ కార్డ్ ద్వారా ట్రాన్సాక్షన్స్ జరిపే ప్రయత్నం చేయాలి. కొన్ని సంబర్భాల్లో ఎక్కువ సార్లు క్రెడిట్ కార్డ్ యొక్క లిమిట్ త్వరత్వరగా వినియోగించుకుంటే కూడా క్రెడిట్ కార్డ్ యొక్కలిమిట్ తగ్గిస్తాయి ఆయా సంస్థలు.

ఇక మినిమమ్ డ్యూస్ చెల్లించకపోయిన క్రెడిట్ కార్డ్ యొక్క లిమిట్ తగ్గిస్తాయి ఆయా సంస్థలు. సాధారణంగా క్రెడిట్ కార్డ్ తో రెండు రకాల బిల్లు చెల్లింపులు జరుగుతూ ఉంటాయి. ఒకటి టోటల్ ఔట్ స్టాండింగ్ బిల్.. రెండవది మినిమమ్ బిల్. అయితే ఔట్ స్టాండింగ్ బిల్ ద్వారా మొత్తం అమౌంట్ ఒకే సారి చెల్లించలేని పక్షంలో చాలా మంది మినిమమ్ డ్యూస్ చెల్లిస్తూ ఉంటారు. అయితే కొన్ని సార్లు ఈ మినిమమ్ బిల్ చెల్లించడంలో కూడా జాప్యం చేప్యం చేస్తుంటారు చాలమంది. అలాంటి సమయాల్లో క్రెడిట్ కార్డ్ లిమిట్ తగ్గే అవకాశం ఉంది. కాబట్టి క్రెడిట్ కార్డ్ ఉన్నవాళ్ళు కచ్చితంగా కార్డ్ ను యాక్టివ్ లో ఉంచుకోవడంతో పాటు డ్యూస్ పెండింగ్ లో ఉండకుండా చూసుకోవాలి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -