టీ న్యూస్‌ ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ – 2020

279
tnews
- Advertisement -

మీరు డాక్టర్ కావాలనుకుంటున్నారా..?విదేశాల్లో ఎంబీబీఎస్ చదివే సువర్ణ అవకాశం..? కోవిడ్ సమయంలో వివిధ దేశాల యూనివర్సిటీల సమాచారాన్ని తెలుసుకోవడంలో మీరు ఇబ్బంది పడుతున్నారా..?అలా అయితే డైరెక్టుగా వివిధ దేశాల యూనివర్సిటీ ప్రతినిధులను ఒకేచోట కలిసే సువర్ణ అవకాశాన్ని కల్పిస్తోంది టీ న్యూస్‌. ఫీజుతో పాటు ఎన్నో సందేహాలపై సలహాలు,మీకు నచ్చే,మీరు మెచ్చే యూనివర్సిటీలను ఎంపిక చేసుకునేందుకు టీన్యూస్ అబ్రాడ్‌

ఎంబీబీఎస్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ 2020ని మీ ముందుకు తీసుకొస్తోంది టీ న్యూస్‌.అక్టోబర్ 17,18 తేదీల్లో ఎడ్యుకేషన్ ఫెయిర్ జరగనుంది. వేదిక కమ్మ సంఘం భవనం,అమీర్ పేట,హైదరాబాద్.సమయం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. ప్రవేశం ఉచితం.

వైద్యవిద్యలో ప్రవేశం కోసం మన రాష్ట్రంలో ఏటా దాదాపు లక్షమంది ఎంసెట్ రాస్తున్నారు. కానీ సీట్లు చూస్తే చాలా పరిమితం. అందుకే ఎంబీబీఎస్ చదవాలనీ ఆసక్తి ఉండీ, అవకాశం లభించనివారు పెద్ద సంఖ్యలో ఉంటున్నారు. ఇలా నిరాశపడే విద్యార్థులు ప్రత్యామ్నాయంగా విదేశీ వైద్యవిద్యవైపు చూస్తున్నారు. అయితే విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలంటే కన్సల్టెన్సీలను సంప్రదించాల్సిన పరిస్థితి. దీనిని క్యాష్ చేసుకుంటున్న కొన్ని కన్సల్టెన్సీలు విద్యార్థులను మోసగించిన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాటలు వేసేందుకు వారి సందేహాలను నివృత్తి చేసేందుకు టీ న్యూస్ తీసుకొస్తున్న ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ ఓ వారధి కానుంది.

ఏ ఏ దేశాల్లో ఎంబీబీఎస్ చేయవచ్చు..?ఆ దేశాల యూనివర్సిటీలో ఎంత ఫీజు ఉంది..?ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఏ దేశాల్లో ఎంబీబీఎస్ చదవడానికి ఆసక్తి చూపించారు..? ఆయా యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాలు, బోధనా ప్రమాణాలు సంతృప్తికరంగా ఉన్నాయా లేదా అని ఈ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ ద్వారా తెలుసుకోవచ్చు. అంతేగాదు ప్రతిష్టాత్మక విదేశీ విద్యా సంస్థల ప్రతినిధులను డైరక్టుగా కలుసుకునే అవకాశం కలుగుతుంది.

భారతీయ వైద్య మండలి (మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) నిబంధనలూ, సూచనల ప్రకారం ఏ యూనివర్సిటీల్లో చదివితే బాగుంటుంది అనే విషయాలను నిపుణులు ఇచ్చే సూచనల ద్వారా తెలుసుకోవచ్చు. ఎంపిక చేసుకున్న కాలేజీకి ఆయా దేశాల ప్రభుత్వ గుర్తింపు ఉందా..? విదేశాల్లో ఎంబీబీఎస్ చేసి తిరిగి భారతదేశంలో ప్రాక్టీస్ చేయవచ్చా..?అనే అంశాలతో పాటు ఎన్నో సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.17,18 తేదీల్లో రెండు రోజుల పాటు జరిగే ఈ ఫెయిర్‌కు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సహా పెద్ద సంఖ్యలో హాజరై తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కోరుకుంటోంది greattelangaana.com,gt tv.

- Advertisement -