సాగర్,శ్రీశైలం అప్‌డేట్స్‌

158
Nagarjuna Sagar Dam
- Advertisement -

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో 10 క్రస్టు గేట్లు 10 ఫీట్ల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు అధికారులు. ఇన్ ఫ్లో , అవుట్ ఫ్లో : 1,90,239 క్యూసెక్కులుగా ఉండగా పూర్తిస్థాయి నీటి నిల్వ : 312.0450 టీఎంసీలు.ప్రస్తుత నీటి నిల్వ : 310.5510 టీఎంసీలు.పూర్తిస్థాయి నీటిమట్టం : 590 అడుగులు.ప్రస్తుత నీటిమట్టం : 589.50 అడుగులు.

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో 7 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఇన్ ఫ్లో : 2,47,032 క్యూసెక్కులు గా ఉండగా ఔట్ ఫ్లో : 2,22,750 క్యూసెక్కులు . పూర్తి స్థాయి నీటి మట్టం: 885 అడుగులు కాగా ప్రస్తుతం :884.80 అడుగులు .పూర్తిస్దాయి నీటి నిల్వ : 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం: 214.8450 టీఎంసీలు.కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

- Advertisement -