బిగ్ బాస్‌..ఆరోవారం ఓటింగ్‌లో టాప్‌ ఎవరో తెలుసా‌!

195
bigg boss

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు 4 విజయవంతంగా 37 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఇక ఆరోవారం ఎలిమినేషన్‌లో భాగంగా ఇంట్లో ఉన్న 13 మంది సభ్యుల్లో 10 మంది ఎలిమినేషన్‌కు నామినేట్ కాగా కెప్టెన్‌గా సొహైల్ ఒకరిని సేవ్ చేసే అవకాశం ఉండటంతో మెహబూబ్‌ని సేవ్ చేయడంతో ఎలిమినేషన్‌లో 9 మంది ఉన్నారు. దీంతో ఈ వారం ఎలిమినేషన్‌లో అరియానా, అభిజిత్, మోనాల్, కుమార్ సాయి, దివి, అఖిల్, నోయల్, లాస్య, హారిక‌లు ఉన్నారు.

ఇక ఈ వారం ఓటింగ్ అప్పుడే ప్రారంభంకాగా అభిజిత్ టాప్ పొజిషన్‌లో ఉన్నారు. అభిజిత్ 34 శాతం ఓట్లతో ఉండగా అఖిల్ 14 శాతం, కుమార్ సాయి 8.75,లాస్య 8.4,హారిక 7.9,దివి 7.35,అరియానా 7.24,నోయల్ 6.01,మోనాల్ 5.38 శాతం ఓట్లతో ఉన్నారు.

ప్రతీవారం లీస్ట్‌లో ఉన్న వారు ఇంటి నుండి ఎలిమినేట్ అవుతుండగా ఈ వారం మోనాల్, నోయల్ లీస్ట్‌లో ఉండటంతో ఎవరు ఎలిమినేట్ అవుతారోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది.