స్టాలిన్ మరో కీలక నిర్ణయం..వారికి ఉచిత ప్రయాణం

103
stalin
- Advertisement -

తమిళనాడు సీఎం స్టాలిన్ తనదైన నిర్ణయాలతో ప్రజాభిమానాన్ని చూరగొంటున్నారు. స్టాలిన్ తీసుకుంటున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా తాజాగా పోలీసులపై వరాల జల్లు కురిపించారు స్టాలిన్.

పోలీసులు ఇకపై తాము ప‌నిచేస్తున్న జిల్లాల్లో ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచితంగా ప్ర‌యాణం చేసే అవ‌కాశాన్ని క‌ల్పిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. దీంతో వేలాది మంది పోలీసులు బ‌స్సుల్లో ఉచితంగా ప్ర‌యాణం చేసే అవ‌కాశం ల‌భిస్తుంది. చెన్నైలోని థౌజెండ్ లైట్స్ ప్రాంతంలో రూ.275 కోట్ల‌తో పోలీస్ క్వార్ట‌ర్స్‌ను నిర్మిస్తామని వెల్లడించారు.

అదేవిధంగా రిస్క్ అల‌వెన్స్‌ను రూ.800 నుంచి రూ.1000 కి పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్న స్టాలిన్…. పోలీసు స్టేష‌న్లో ప‌నిచేస్తున్నకానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్ల‌కు వారం రోజుల‌పాటు అద‌నంగా సెల‌వులు మంజూరు చేశారు. అలాగే ఇక‌పై ఏటా ఉచితంగా ప‌నిచేస్తున్న పోలీసుల‌తో పాటుగా వారి భార్య‌ల‌కు కూడా ఉచితంగా వైద్య‌ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు.

- Advertisement -