ఆర్సీబీ జెర్సీ ఛేంజ్..ఎందుకో తెలుసా..?

142
rcb

ఐపీఎల్ 14వ సీజన్ మిగిలిన మ్యాచ్‌లు మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే అన్ని జట్లు దుబాయ్‌కి చేరుకోగా ఇక ఇప్పటివరకు ఉన్న తమ జెర్సీని మార్చుకుంది ఆర్సీబీ. సెప్టెంబర్‌ 20 న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌) తో జరుగనున్న మ్యాచ్‌లో రెడ్‌ జెర్సీకి బదులుగా బ్లూ జెర్సీని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) (RCB) జట్టు ధరించనున్నది. ఈ విషయాన్ని ఆర్సీబీ అఫీషియల్‌ ట్విట్టర్‌ ఖాతాలో వెల్లడించింది.

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఎంతో విలువైన సేవలను అందించిన ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు మద్దతును ప్రకటిస్తూ ఈ నీలి రంగు జెర్సీని ధరిస్తున్నట్లు ఆర్సీబీ ట్విట్టర్‌ ద్వారా తెలిపింది. కొవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటానికి నాయకత్వం వహిస్తున్న ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ అమూల్యమైన సేవలకు నివాళి అర్పించేందుకు.. ఫ్రంట్‌లైన్‌ యోధులు ధరించే పీపీఈ కిట్‌ల రంగును పోలివుండే బ్లూ జెర్సీని ధరించడం ఆర్సీబీ సభ్యులుగా మాకు గర్వకారణం అని ట్విట్టర్‌లో పేర్కొన్నది.

ఈ క్లిష్ట సమయంలో గ్రౌండ్ లెవల్‌లోని ఫ్రంట్‌లైన్ కార్మికులకు ఎలా సహాయపడవచ్చనే దానిపై చర్చించి వారికి మద్దతుగా నిలిచేందుకు బ్లూ జెర్సీని ధరించాలని నిర్ణయించాం అన్నారు ఆర్సీబీ కెప్టెన్ విరాట్.