సింధు బయోపిక్‌లో బాలీవుడ్ బ్యూటీ..!

168
sindhu

వెండి తెరపై బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు సినీ,రాజకీయ,క్రీడా రంగాలకు చెందిన ప్రముఖుల బయోపిక్‌లు తెరకెక్కగా తాజాగా మరో స్టార్ బయోపిక్ వెండితెరపై రానుంది. భారత స్టార్ షట్లర్ పీవీ సింధు బయోపిక్ తెరకెక్కనుండగా ఇందులో సింధు కోరిన విధంగానే బాలీవుడ్ బ్యూటీ ఆమె పాత్రలో నటించనుంది.

సింధు బయోపిక్‌లో బ్యూటీ దీపికా పదుకొనే నటించడమే కాదు ఆమెనే స్వయంగా ఈ సినిమాను ప్రొడ్యూస్‌ను చేయనున్నారట. గతంలో దీపిక తన సొంత నిర్మాణ సంస్థ కెఎ ఎంటర్ టైన్ మెంట్ ను ప్రారంభించి తొలియత్నంగా ‘ఛపాక్’ సినిమా తీసింది. ఇప్పుడు సింధు బయోపిక్ కూడా అదే బ్యానర్‌లో నిర్మించనుంది. ప్రస్తుతం ఈ వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.