- Advertisement -
పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. తాజాగా టీఎంసీకి చెందిన సీనియర్ నేత దినేష్ త్రివేది తన రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తన రాష్ట్రంలో రాజకీయ హింస జరుగుతున్నా తాను నిస్సహాయుడిగా మిగిలిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ ఆదేశాలను పాటించాలని ఉన్నా తాను ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నానని తెలిపారు. నన్ను ఇక్కడికి పంపినందుకు పార్టీకి కృతజ్ఞతలు…తాను రాష్ట్రానికి సేవ చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. బెంగాల్‌లో జరుగుతున్న హింసతో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లనుంది. ఇక్కడ కూర్చోవడం నాకు చాలా వింతగా అనిపిస్తోంది. నేను ఏం చేయాలి అని ఆలోచించే రాజీనామా చేస్తున్నాను అని త్రివేదీ వెల్లడించారు.
ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు ,ఎంపీలు తృణమూల్‌ను వీడి బీజేపీ గూటికి చేరారు.
- Advertisement -