టాక్‌ ఆఫ్‌ ది వీక్‌..మహువా మొయిత్రా

749
moitra
- Advertisement -

పార్లమెంట్ సమావేశాల్లో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారారు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా. ఆమె పుట్టింది మాత్రమే భారత్‌లో పెరిగింది,చదివింది అమెరికాలోనే. రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేకపోయినా పార్లమెంట్‌లో ఆమె ప్రసంగానికి అధికార బీజేపీనే ఆశ్చర్యపోయింది. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆమెపై ప్రశంసలు గుప్పించారు.

2016లో తృణమూల్ ప్రధాన కార్యదర్శిగా మొయిత్రా ఉన్న సమస్యలపై లోతుగా అధ్యయనం చేశారు. ఆ అనుభవంతోనే లోక్‌సభలో తొలిసారిగా మాట్లాడిన ఆమె ఎక్కడా సొంత పార్టీ గొప్పతనం గురించి గానీ అధికార పార్టీపై విమర్శలు గుప్పించడం గానీ చేయలేదు.

దేశాన్ని పట్టి పీడిస్తున్న ఏడు సమస్యల గురించి చట్టసభలో లేవనెత్తారు. దేశంలో నిరంకుశ సంకేతాలు కనిపిస్తున్నాయంటూ ప్రసంగం ప్రారంభించిన మహువా… దేశాన్ని విభజించాలనే కోరిక,మానవ హక్కులను కాలరాయడం,మీడియా స్వేచ్ఛను హరించడం, భయానక వాతావరణాన్ని సృష్టించడం, పౌరసత్వ వివాదం, కళలను, మేధావులను అణచి వేయడం, ఎన్నికల సంఘం స్వతంత్రతను కోల్పోతుండటం వంటి సమస్యలను లేవనెత్తారు.

అమె ప్రసంగాన్ని మధ్యలో కొందరు ఎంపీలు అడ్డుకోవాలని చూసినప్పటికీ..వారిని వారించకుండా నేరుగా స్పీకర్‌తోనే మాట్లాడారు. ఇది గొప్ప ఆలయం..అల్లర్లు సృష్టించే అడ్డా కాదు అంటూ తనను అడ్డుకుంటున్న వారిని ఉద్దేశించి సెటైర్లు వేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో టాక్‌ ఆఫ్‌ ది వీక్‌గా మారింది మహువా.

బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఈమె అత్యంత సన్నిహితురాలైన మహువా…ఇటీవల జరిగిన లోక్‌ సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్‌ నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి కల్యాణ్‌ చౌబేపై 63,218 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

- Advertisement -