తిరుమల అప్‌డేట్..

8
ttd
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం 14 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉండగా టోకెన్లు లేని భక్తులకు స్వామి వారి దర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న స్వామివారిని 70,496 మంది దర్శించుకోగా హుండి ద్వారా 5.88 కోట్ల ఆదాయం వచ్చింది.

ఇక హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో తిరుపతి మహతి కళా క్షేత్రంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి భగవద్గీత కంఠస్థం పోటీల విజేతలకు రాత్రి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆనందతీర్థాచార్యులు మాట్లాడుతూ భగవద్గీత మానవాళికి జ్ఞానాన్ని ప్రసాదించే అద్భుతమైన గ్రంథమని అన్నారు. గాంధీజీని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ గీతను పఠించాలని సూచించారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -