2023 కోసం పూజా వెయిటింగ్

114
- Advertisement -

పూజా హెగ్డేకి 2022 అస్సలు కలిసి రాలేదు. ఈ ఏడాది రాధే శ్యామ్, బీస్ట్ మరియు ఆచార్య వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ తో ప్రేక్షకుల ముందకొచ్చింది పూజ. ఈ సినిమాలపై చాలా ఆశలు పెట్టుకుంది. మూడు హిట్స్ తో ఈ ఇయర్ హ్యాట్రిక్ హిట్స్ అందుకోవాలని భావించింది. కానీ ఈ సినిమాలన్నీ పూజ ఆశలపై నీళ్లు జల్లాయి. వరుస ఫ్లాప్‌లతో ఈ సంవత్సరాన్ని పూర్తి చేసింది పూజ.

ఇటీవల బాలీవుడ్‌లో ఆమె నటించిన సర్కస్ కూడా డిజాస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు వచ్చే 2023 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కొత్త సంవత్సరంలో, ఆమె సల్మాన్ ఖాన్ తో ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ , మహేష్ బాబు #SSMB28ని సినిమాలతో రాబోతుంది. కిసీ కా భాయ్ కిసీ కి జాన్ 21 ఏప్రిల్ 2023న విడుదల కానుంది.

#SSMB28 వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల కానుంది. ఈ ఇద్దరు సూపర్‌స్టార్లు తనకు హిట్‌లు ఇస్తారని ఎదురుచూస్తుంది. కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ షూట్ సంబందించి పూజ షూట్ దాదాపు కంప్లీట్ అయింది. జనవరి నుండి #SSMB28 షూట్‌లో పాల్గొననుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -