మైసూరు పులి…టిప్పు సుల్తాన్

36
- Advertisement -

దేశ స్వాతంత్య్ర చరిత్ర ఎందరో అమరుల త్యాగాలతో నిండి ఉంది. దేశ రక్షణ కోసం అనేక మంది ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు. అందులో ఒకరు టిప్పు సుల్తాన్. 1750 నవంబర్ 10న జన్మించిన టిప్పు..పిన్న వయస్సులోనే తన ప్రతిభను చాటి బ్రిటిషర్లను గడగడలాడించాడు. చిన్న వయసులోనే టిప్పు చూపిన తెగువ, ధైర్య సాహసాలు అనితర సాధ్యం.ఆయన సైన్యంలోని 19 మంది సేనాపతుల్లో 10 మంది,13 మంది మంత్రులలో ఏడుగురు హిందువులే. పరమత సహనానికి మారుపేరుగా నిలిచిన టిప్పు తండ్రికి తగ్గ తనయుడిగా అనేక విజయాలను సాధించాడు.

1782 లో జరిగిన రెండవ మైసూరు యుద్ధంలో తండ్రికి కుడిభుజంగా ఉండి బ్రిటీషువారినీ ఓడించాడు. తండ్రి హైదర్ అలీ అదే సంవత్సరంలో మరణించాడు. చివరికి రెండో మైసూరు యుద్ధం మంగళూరు ఒప్పందముతో ముగిసి 1799 వరకు టిప్పుసుల్తాన్ మైసూరు సంస్థానమునకు ప్రభువుగా కొనసాగాడు. తన పాలన సంస్కరణలతో మైసూరు పులి గా ఖ్యాతిగాంచారు టిప్పు.

Also Read:శరత్ బాబు..పుకార్లు నమ్మొద్దు

ఏ ఆంశానికి సంబంధించినదైనా, ఎటువంటి విశిష్ట,సాంకేతిక సమాచారమైనా అధ్యయనం చేసిన ఆకళింపు చేసుకోవటం నూతనత్వాన్ని అను నిత్యం ఆహ్వానించటం టిపూ ప్రత్యేకత. భారతీయ, పాశ్చాత్య తత్వవేత్తల,రాజనీతిజ్ఞుల గ్రంథాలను సేకరించి అధ్యయనం చేశారు. ఈ విధంగా సేకరించిన అపూర్వగ్రంథాల అధ్యాయనం ద్వారా సంపాదించుకున్న పరిజ్ఞానం, సాంఫిుక, ఆర్థ్దిక,రాజకీయ పరిణామాల మీద టిపూ సాధికారికంగా చేసినటువంటి విశ్లేషణలు, ఫ్రెంచ్‌,ఆంగ్లేయాధికారులను ఆశ్చర్యచకితులను చేసేవి.

ప్రజల జీవితాలను సుఖమయం చేసేందుకు టిపూ వినూత్న విధానాలను అనుసరించారు. పాశ్చాత్య సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్ని రంగాలకు వర్తింపచేశారు. అన్ని ప్రభుత్వ విభాగాలలో ప్రజలకు సంబంధించిన అన్నిరంగాలలో పలు విప్లవాత్మక మార్పులు చేశారు. ప్రజలు మోసాలకు గురికాకుండ తగిన కట్టుదిట్టమైన చర్యలను తీసుకున్నారు.

Also Read:ఢిల్లీలో BRS ఆఫీస్ ప్రారంభం..

1793 లో వంద నౌకల నిర్మాణాం చేపట్టారు. యుద్ద లో నావికాదాళం నిర్వహించే ప్రత్యేక ప్రాధాన్యత దృష్త్యా యుద్ధ నౌకల నిర్మాణం, సైన్యానికి శిక్షణ కోసం ఆయన పటిష్టమై ఏర్పాట్లు చేశారు. వ్యవసాయ రంగాన్ని ఎంతగానో ప్రోత్సహించారు. నీిటి పారుదల సౌకర్యం కల్పించేందుకు అధిక శ్రద్ధ చూపించారు. పన్ను విధింపు పద్దతిలో మార్పులు చేశారు. పన్ను అనేది భూమి విస్తీర్ణం మీద ఆధారపడి కాకుండ, ఉత్పత్తి మీద ఆధారపడి నిర్ణయించారు. ప్రజలు ఏ మతస్థులైనా ఏ విషయంలో కూడ ఆయన వివక్షత చూపలేదు.

బ్రిటిషర్లతో రాజీలేని పోరాటం చేశారు. చిన్ననాటనే అసమాన ధైర్యసాహసాలతో, తండ్రికి తగిన తనయుడన్పించుకున్న టిపూ తన చివరి శ్వాస వరకు ఈస్ట్‌ ఇండియా పాలకులను మాతృదేశం నుండి తరిమి వేయడానికి అవిశ్రాంత ప ఓరాటం చేశారు. చివరగా బ్రిటిషర్లతో జరిగిన పోరాటంలో 1799 మే 4న కన్నుమూశారు.

Also Read:హ్యాపీ బర్త్ డే..త్రిష

- Advertisement -