బరువు తగ్గడం కోసం తక్కువ తింటున్నారా?

1
- Advertisement -

తక్కువ తింటున్నా, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నా బరువు తగ్గకపోవడం చాలా మందిని నిరాశకు గురి చేస్తుంది. దీనికి కారణం మీ ప్రయత్న లోపం కాకపోవచ్చు..బహుశా మీరు మీ క్యాలరీలను అతిగా తగ్గించడమే ఇందుకు కారణం కావచ్చు.

ఎందుకంటే అవసరానికి మించి చాలా తక్కువగా తినడం వల్ల కాలక్రమేణా బరువు తగ్గడం మరింత కష్టంగా మారుతుంది. రోజుకు 800, 900 లేదా 1,000 క్యాలరీల వంటి చాలా తక్కువ ఆహారాన్ని తీసుకున్నప్పుడు, శరీరానికి అవసరమైన ఇంధనం (శక్తి) మరియు పోషకాలు అందవు. దీనిని శరీరం ఒక విపత్తుగా భావించి, తీవ్రమైన ఆకలిని మరియు ఫుడ్ క్రేవింగ్స్ (ఆహారం తినాలనే కోరిక) ను పెంచుతుంది.

ఫలితంగా ఒక రోజు కాకపోయినా మరొక రోజైనా నియంత్రణ కోల్పోయి అతిగా తినేస్తారు. అయితే, చాలా మంది తాము పస్తులున్న రోజులను గుర్తుపెట్టుకుంటారు కానీ, ఆ తర్వాత ఎమోషనల్‌గా అతిగా తిన్న రోజులను మర్చిపోతారు. అందుకే “ఏమీ తినకపోయినా బరువు పెరగడం ఏంటి? అనే గందరగోళం మొదలవుతుంది.

శరీరానికి తగినంత ఆహారం అందనప్పుడు అది తన వద్ద ఉన్న శక్తిని ఆదా చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇది మనకు తెలియకుండానే చాలా సూక్ష్మంగా జరుగుతుంది. మీ రోజువారీ వ్యాయామం యథావిధిగా ఉన్నప్పటికీ, రోజంతా మీరు చేసే ఇతర కదలికలు తగ్గిపోతాయి.మీరు ఎక్కువ సమయం కూర్చోవడానికి మొగ్గు చూపుతారు, తక్కువ నడుస్తారు మరియు చేతులు, కాళ్లు కదిలించడం కూడా తగ్గిస్తారు. మిమ్మల్ని రక్షించుకోవడానికి శరీరం ఆటోమేటిక్‌గా చేసే ప్రక్రియ ఇది.

Also Read:రికార్డులతో పనిలేదు:మెస్సీ

సుదీర్ఘకాలం పాటు చాలా తక్కువగా తినడం వల్ల మన బాసల్ మెటబాలిక్ రేట్ దెబ్బతింటుంది. మనం విశ్రాంతిగా ఉన్నప్పుడు కూడా శరీరం తన ప్రాథమిక విధులను నిర్వహించడానికి ఖర్చు చేసే క్యాలరీల సంఖ్యనే బీఎంఆర్ అంటారు. మనం క్యాలరీలను విపరీతంగా తగ్గించి, కదలికలను తగ్గించినప్పుడు, శరీరం ఆ తక్కువ స్థాయికి అలవాటు పడిపోతుంది. దీనివల్ల BMR పడిపోతుంది. మెటబాలిజం నెమ్మదించడం వల్ల క్యాలరీ డెఫిసిట్ (క్యాలరీల కొరత) సృష్టించడం కష్టంగా మారుతుంది. అటువంటి స్థితిలో కొంచెం ఎక్కువ తిన్నా, శరీరం చాలా వేగంగా బరువును పెంచేస్తుంది.

- Advertisement -