మోదీ-మెలోని..ఫేమస్ కపుల్!

0
- Advertisement -

ఫ్రాన్స్‌లోని ఎవియన్-లెస్-బైన్స్ లో జరిగిన జీ7 (G7) సదస్సు వేదికగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, భారత ప్రధాని నరేంద్ర మోదీల మధ్య జరిగిన ఒక సరదా సంభాషణ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఇద్దరు ప్రపంచ నేతలు తమ పాత ‘మెలోడీ’ (Melody) క్షణాల గురించి నవ్వుకుంటూ జోక్ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది.

జీ7 సదస్సు జరుగుతున్న సమయంలో ఆన్ చేసి ఉన్న మైక్రోఫోన్ రికార్డింగ్‌లో జార్జియా మెలోని…. ప్రధాని మోదీని పలకరిస్తూ.. మేమే ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యంత ఫేమస్ కపుల్ (అత్యంత ప్రజాదరణ పొందిన జంట)… అని చమత్కరించినట్లు రికార్డ్ అయింది. వీరిద్దరి మధ్య ఉన్న మంచి స్నేహబంధం మరియు సాన్నిహిత్యం వారి అధికారిక పర్యటనల్లో కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది.

మెలోని చేసిన ఈ ఇన్‌స్టాగ్రామ్ కామెంట్ వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. మే నెలలో ప్రధాని మోదీ ఐదు దేశాల పర్యటనలో భాగంగా ఇటలీ వెళ్లినప్పుడు, భారతదేశం నుండి ‘మెలోడీ చాక్లెట్’ ప్యాకెట్‌ను తీసుకెళ్లి మెలోనికి బహుమతిగా ఇచ్చారు. ఆ సమయంలో వీరిద్దరూ కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు.

Also Read:రికార్డులతో పనిలేదు:మెస్సీ

ఆ వీడియోలో మెలోని నవ్వుతూ.. ప్రధాని మోదీ మా కోసం ఒక బహుమతి తెచ్చారు. ఇది చాలా చాలా మంచి టాఫీ (చాక్లెట్) అని చాక్లెట్ ప్యాకెట్‌ను చూపించారు.ఈ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు ఏకంగా 1.3 కోట్ల (13 మిలియన్ల) లైకులు వచ్చాయి. ప్రపంచం మోదీ, మెలోనిల పేర్లను కలిపి (Modi + Meloni) ‘మెలోడీ’ (Melodi) అనే ట్రెండింగ్ పేరును నెటిజన్లు వైరల్ చేశారు.

- Advertisement -