రఘునందన్‌రావుకు చేదు అనుభవం…

189
dubbaka raghunandanrao

దుబ్బాక నియోజకవర్గంలో బీజేపీ నేత రఘునందన్ రావుకు చేదు అనుభవం ఎదురైంది. రాయపోల్ మండలం తిమ్మక్కపల్లి గ్రామానికి ప్రచారానికి వెళ్లిన రఘునందన్‌రావును అడ్డుకున్నారు గ్రామస్తులు.

తన ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్‌పై విమర్శలు చేయడంతో గ్రామస్తులు ఆయన ప్రసంగానికి అడ్డు తగిలారు. బీజేపీ నేతలు చేసిందేమీలేదని …ప్రజల సంక్షేమం కోసం టీఆర్ఎస్ అనేక పథకాలు ప్రవేశపెట్టిందని రఘునందన్‌తో వాగ్వాదానికి దిగారు. దీంతో చేసేదేమి లేక రఘునందన్‌ రావుతో పాటు బీజేపీ నేతలు అక్కడినుండి వెనుదిరిగారు.