ఎంపీ రంజిత్ రెడ్డి బర్త్‌డే.. మొక్కలు నాటిన నాయకులు..

119
Green India Challenge

చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.తాండూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ పటోళ్ల దీపా నరసింహులు మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో పార్టీ నాయకులు, సిబ్బందితో కలిసి మొక్కలు నాటి ఎంపీ రంజిత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

అలాగే వికారాబాద్‌లో టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర నాయకులు శుభప్రద పటేల్ స్థానిక నాయకులతో కలిసి మొక్కలు నాటి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపీ రంజిత్ రెడ్డి పుట్టినరోజు పురస్కరించుకొని ఏదైనా మంచి కార్యక్రమం చేపట్టాలని ఉద్దేశంతో రాజ్యసభ సభ్యులు సంతోష్ పిలుపు మేరకు ఈరోజు మొక్కలు నాటి ఎంపీ రంజిత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అని తెలిపారు.