దేశం మారాల్సిన అవసరం ఇప్పుడు వచ్చిందని సీఎం కేసీఆర్ అన్నారు. ఆలోచన తీరు మారకపోతే ఎన్నికలు ఎన్ని వచ్చినా ప్రజల్లో మార్పురాదని అన్నారు. నాగ్‌పూర్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభించిన సీఎం కేసీఆర్…అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…లక్ష్యం లేని దేశం ఎక్కడకు వెళ్తొందని ప్రశ్నించారు. దేశంలో ఎలాగైన ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా పెట్టుకొని పార్టీలు పనిచేస్తున్నాయన్నారు. ఎన్నికల రాజకీయ తంత్రంలో దేశం చిక్కుకుపోయిందన్నారు.
ఎన్నికలల్లో నేతలు కాదు ప్రజలు గెలవాలని పిలుపునిచ్చారు. జనం చంద్రుడు, నక్షత్రాలు కోరడం లేదు.. నీళ్లు ఇవ్వమని కోరుతున్నారు అని కేసీఆర్ పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా ప్రజల స్థితిగతులు మారలేదు. ఔరంగాబాద్‌లో 8 రోజులకు ఒకసారి తాగునీరు వస్తుంది. గంగా, యమునా డెల్టా ప్రాంతమైన ఢిల్లీలోనూ ఇదే దుస్థితి ఉంది. ఢిల్లీలో తాగునీరే కాదు.. విద్యుత్ కొరత సమస్య కూడా ఉందని తెలిపారు కేసీఆర్. ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓడింది.. కాంగ్రెస్ గెలిచింది. పరిస్థితుల్లో మార్పు రానప్పుడు ఎవరు గెలిచి ఏం ప్రయోజనమని ప్రశ్నించారు.
Also Read: పవన్ కాన్ఫిడెన్స్ కు కారణం అదే ?
దేశంలో ఎస్సీల పరిస్థితులు మారనంత కాలం దేశం అభివృద్ధి చెందదు. దళితుల, ఆదివాసీల ఉద్ధరణ జరిగి తీరాల్సిందే అని కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రపంచంలో భారత్‌లోనే ఎక్కువ శాతం సాగు యోగ్యమైన భూమి ఉంది. మనం తలుచుకుంటే దేశంలోని ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వొచ్చు. భగవంతుడు ఎన్నో వనరులు సమృద్ధిగా ఇచ్చినా ప్రజలకు ఎందుకీ కష్టాలు. జల విధానం సమూలంగా మారితేనే మార్పు సాధ్యమవుతుందని అన్నారు.
Also Read: CMKCR:నాగ్‌పూర్‌లో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం