ఫస్ట్ సెంచరీ..ఎప్పటికీ ప్రత్యేకమే

7
- Advertisement -

ఐపీఎల్ (IPL) 2026లో ముంబై ఇండియన్స్ ఆటగాడు తిలక్ వర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తన అద్భుత ప్రదర్శనతో కెరీర్‌లో తొలి ఐపీఎల్ సెంచరీని నమోదు చేశాడు. ఈ సందర్భంగా తిలక్ వర్మ తన సంతోషాన్ని పంచుకున్నారు.

తన మొదటి ఐపీఎల్ సెంచరీ సాధించడం పట్ల తిలక్ వర్మ స్పందిస్తూ.. “తొలి సెంచరీ అనేది ఎప్పటికీ ప్రత్యేకమైనది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ లాంటి గొప్ప జట్టు కోసం, వాంఖడే స్టేడియం వంటి వేదికపై ఈ విజయం అందుకోవడం చాలా ఆనందంగా ఉంది” అని అన్నారు.

నా వ్యక్తిగత స్కోరు గురించి ఆలోచించలేదు. జట్టును మంచి స్థితిలో నిలబెట్టడమే నా లక్ష్యం. పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ చేశాను. సెంచరీ పూర్తయ్యాక కలిగిన సంతృప్తి మాటల్లో చెప్పలేనిది అని పేర్కొన్నారు.

తన ఎదుగుదలలో ముంబై ఇండియన్స్ యాజమాన్యం, కోచ్‌లు మరియు కెప్టెన్ అందించిన సహకారం మరువలేనిదని తిలక్ తెలిపారు. తనపై నమ్మకం ఉంచినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. కేవలం 52 బంతుల్లోనే తిలక్ వర్మ తన సెంచరీని పూర్తి చేశాడు. తిలక్ వర్మ ఇన్నింగ్స్‌పై సోషల్ మీడియాలో మాజీ క్రికెటర్లు మరియు అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also Read:మళ్లీ వచ్చేది బీఆర్ఎస్‌ సర్కారే: కేసీఆర్

- Advertisement -