- Advertisement -
మంగళవారం విదేశాల నుంచి దిగుమతి చేసిన 40 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ను ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్కు తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టీఐఎఫ్) ప్రతినిధులు అందించారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారితో ఆక్సిజన్ కొరతతో చాలా మంది మరణిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆక్సిజన్ కొరతను తగ్గించడానికి తెలంగాణ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని టీఐఎఫ్ స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా టీఐఎఫ్ కృషిని కేటీఆర్ ప్రశంసించారు. కరోనాను ఎదుర్కొనేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని, కరోనా రోగులను ఆదుకునేందుకు సహకారం అందించాలన్నారు.ఈ కార్యక్రమంలో టీఐఎఫ్ అధ్యక్షులు కొండవీటి సుధీర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ మిరుపాల గోపాల్ రావు, సభ్యులు సీతాలా శంకర్ రావు పాల్గొన్నారు.
- Advertisement -